Monday, April 29, 2024
- Advertisement -

ఏసీలో ఉండాల్సిన మంత్రులు.. నంద్యాల రోడ్లంబ‌డి తిరుగుతున్నారు.

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్తుల‌కు ఏమో గాని రాష్ట్ర‌మంత్రుల‌కు మాత్రం చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.హాయిగా ఏసీలో ఉండి ప‌రిపాల‌న చేయ‌కుండా దాన్ని గాలికొదిలేసి నంద్యాల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.ఇదంతా బాబు పుణ్య‌మే.ఉప ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల‌ని బాబు ఆల్టిమేట్టం ఇవ్వ‌డంతో చేసేది లేక మంత్రులంతా ప‌రుగుపెడుతున్నారు.ఉప ఎన్నిక‌ల‌ను ఇప్ప‌టికే మంత్రులు నారాయ‌న‌,కాల్వ‌శ్రీనివాసులు,కేయీకి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.వారికితోడు పిరాయింపు మంత్రులుకూడా తోడ‌య్యారు.ఆర‌డ‌జ‌నుకు పైగా మంత్రులు అక్క‌డే తిష్ట‌వేసి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు.మంత్రులంద‌రూ స్థానికి ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌ల‌సి బృందాలుగా ఏర్ప‌డి రోడ్ల‌వెంట ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తున్నారు.
ఏ కులం మంత్రులు ఆ కులం ఓటర్లను ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, లోకేష్‌, అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, నారాయణలు విడతల వారీగా పర్యటిస్తున్నారు.అంతేనా నంద్యాల ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో ఇంద్ర‌లోకాన్ని చూపిస్తున్నారు.ఎన్నిక‌ల్లో గెలిస్తే ఇంద్ర‌లోకం లాగా మారుస్తామ‌ని హామీలు ఇస్తున్నారు.
ఏసీల‌ల్లో ఉండాల్సిన మంత్రులు ఇలా రోడ్ల‌వెంట తిర‌గ‌డం ఏంట‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.శ‌నేశ్వ‌రుని దెబ్బ‌కు ఈశ్వ‌రుడే అల్లాడిపోయాడు….మ‌రి బాబు దెబ్బ‌కు మంత్రులు ఎంత‌.అందుకే మంత్రులు అంతా అక్క‌డే తిష్ట‌వేశారు.ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తే మ‌రెంత మంది మంత్రులు రోడ్ల‌వెంట తిరుగుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -