- Advertisement -

యోగా,వాకింగ్..జైలులో బాబు దినచర్య ఇదే!

- Advertisement -

టీడీపీ చీఫ్‌ చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇది నిజంగా సంక్లిష్ట సమయం. ఎందుకంటే తన జీవితంలో జైలు పాలు అవుతారని బాబు కలలో కూడా అనుకొని ఉండరు. కానీ అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చింది. రెండో రోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో బాబు దినచర్య సాగిందిలా.

యోగా, వాకింగ్ చేసి న్యూస్ పేపర్స్ చదివారు చంద్రబాబు. ఇంటి నుండి వచ్చిన ఆహారం ,మెడిసిన్స్ తీసుకున్నారు. నిన్న రాత్రి 8 గంటల తర్వాత నిద్రపోయిన చంద్రబాబు ఉదయం 5.30 గంటలకు నిద్రలేచారు. లంచ్ లో బ్రౌన్ రైస్ తో బెండకాయ ఫ్రై, పన్నీరు,పెరుగు తిన్నారు.

జైలులో బాబు భద్రత కోసం ఐదుగురు పోలీసులను అనుమతించగా ఎన్‌ఎస్‌జీని మాత్రం అనుమతించలేదు.ఇక ఇవాళ బాబుతో ములాఖత్‌కు అనుమతి కోరింది ఆయన కుటుంబం. సాయంత్రం 4 గంటలకు ఫ్యామిలీతో ములాఖత్ జరగనుండగా ఇప్పటికే నారా భువనేశ్వరి, బ్రహ్మని రాజమండ్రి చేరుకున్నారు.

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన తరపు లాయర్లు వాదించిన నేపథ్యంలో స్నేహ బ్లాక్ మొత్తం బాబుకే కేటాయించారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకి కిలో మీటర్ దూరంలో టీడీపీ క్యాంప్ ఉంది. రాజమండ్రి జైలు బయట దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక న్యాయస్థానంలో బాబు లాయర్ లూథ్రాకు ధీటుగా వాదిస్తున్నారు ఏఐజీ సుధాకర్‌. ఇక చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం తర్వాత తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -