Thursday, May 16, 2024
- Advertisement -

కర్నూల్ టూర్ బాబుకు నష్టం చేసిందా? లాభం చేకుర్చిందా?

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వైసీపీ బలంగా ఉన్న స్థానాలను టీడీపీ వైపు తిప్పుకుంటే ఎన్నికల్లో విజయం సులువౌతుందని అంచనా వేసిన బాబు.. ముందుగా వైసీపీ కంచుకోటగా వున్న రాయలసీమ జిల్లాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల మూడు రోజులు కర్నూల్ జిల్లాలోని వివిధ నియోజిక వర్గాలలో రోడ్ షోలు. బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహించారు..

అయితే ఈ మూడు రోజుల పర్యటనలో ఓవైపు నిరసన సెగ గట్టిగానే తగిలినప్పటికి, ప్రజలు మాత్రం బాబుకు ఊహించని రీతిలో వెల్కం పలికారు. ఇక కర్నూల్ పర్యటనలో బాబు కొంత రాజకీయ సంచలనానికి కూడా తెరతీశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాన్ని తనవైపు తిప్పుకున్నారు. దీంతో సానుభూతి కోసం బాబు వేసిన వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో తెలియదుగాని.. బాబు నిర్ణయం పట్ల ప్రత్యర్థి పార్టీ నుంచి ఇటు ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చంద్రబాబు నిజం ఒప్పుకున్నారని అధికార వైసీపీ విమర్శలు చేస్తుంటే.. ప్రజలు మాత్రం మారుతున్న రాజకీయ పరిణామాలను తీక్షణంగా గమనిస్తున్నారు.

మరోవైపు బాబు రాయలసీమ ద్రోహి అని కర్నూల్ కు హైకోర్ట్ రాకుండా అడ్డుకుంటున్నారని.. నిరసనకారుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ.. జగన్ పాలనపై రౌడీ రాజ్యం అంటూ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఇక ఎట్టకేలకు నవంబర్ 19తో కర్నూల్ పర్యటనను ముగించుకున్నారు చంద్రబాబు. ఇక ఈ పర్యటనలో బాబుకు ఒరిగిందేంటి అంటే గతంతో పోలిస్తే కర్నూల్ లో ఈసారి ప్రజలను ఆకర్షించడంలో సక్సస్ అయ్యారు. దీంతో ఈసారి కర్నూల్ జిల్లాలో టీడీపీ గట్టిగా రాణించడం ఖాయమనే భావన తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. మరి మొత్తానికి కర్నూల్ టూల్ లో పోలిటికల్ హిట్ ను తారస్థాయికి తీసుకెళ్లారు బాబు. మరి టీడీపీ ఆశించినట్లుగా కర్నూల్ లో ఈసారి వైసీపీకి టీడీపీ ఎంతమేర పోటీ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

వైసీపీకి భవిష్యత్ ప్రత్యర్థి బీజేపేనట..మరి జనసేన?

కవితకు బీజేపీ ఆహ్వానం.. నిజమే!

ఏపీలో సింపతీ రాజకీయాలు..ప్రజా మద్దతు ఎవరికి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -