Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీకి భవిష్యత్ ప్రత్యర్థి బీజేపేనట..మరి జనసేన?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని… ఒకవేళ తనను గెలిపించకపోతే ఇదే తనకు చివరి ఎన్నిక అవుతుంది అంటూ గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు చంద్రబాబు మనసులోని మాటలా లేక రాజకీయ వ్యూహామా అనే చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇతర పార్టీలకు బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో బలమైన నేత ఒక పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు దూరం అయితే టీడీపీ చాలా బలహీన పడే అవకాశం ఉంది. .

దాంతో టీడీపీ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు జనసేన, బీజేపీ వంటి పార్టీలు లైన్లో ఉన్నాయి. ఇప్పటికే జనసేన బలం ఏపీలో అంతకంతకూ పెరుగుతోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయాలకు స్వస్తి చెబితే పవన్ ఆ స్థానాన్ని చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బీజేపీ కూడా టీడీపీ ప్లేస్ ను ఆక్రమించుకునేందుకు సిద్దంగానే ఉంది. కానీ ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీను కన్సిడర్ చేసేందుకు ప్రజలు కూడా సిద్దంగా లేరు. కానీ చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ బీజేపీ కే అనుకూలంగా మారుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఎందుకంటే చంద్రబాబు లేని టీడీపీలో చాలా మంది తెలుగుతమ్ముళ్ళు బీజేపీ వైపు చేసే అవకాశం ఉందని కాషాయదళం భావన. అందుకే తాజాగా బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఇదే వైఖరిలో వ్యాఖ్యలు చేశారు.

టీడీపీలో అభద్రతా భావం కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో వైసీపీకి నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ నే అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం బీజేపీ జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పోలిస్తే జనసేనకే బలం ఎక్కువ ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జనసేన బీజేపీతో కలిసి నడిచే అవకాశం ఉందా అంటే చెప్పడం కష్టమే. బీజేపీ కార్యాచరణలో గాని ఇటు జనసేన కార్యాచరణలో గాని ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇరు పార్టీల నేతలు.. అంటే దీన్ని బట్టి చూస్తే బీజేపీ జనసేన కూటమి నామమాత్రమే అనే విషయం అర్థమౌతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. కానీ భవిష్యత్ లో మాత్రం వైసీపీ కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని కమలనాథులు చెబుతున్నారంటే.. జనసేన జట్టు దాదాపుగా నామమాత్రమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి భవిష్యత్ లో టీడీపీ తరువాత వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ నిలుస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

కవితకు బీజేపీ ఆహ్వానం.. నిజమే!

ఏపీలో సింపతీ రాజకీయాలు..ప్రజా మద్దతు ఎవరికి?

బండి సంజయ్ షాక్ తప్పదా..హైకమాండ్ చూపు ఎవరివైపు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -