Monday, April 29, 2024
- Advertisement -

కవితకు బీజేపీ ఆహ్వానం.. నిజమే!

- Advertisement -

తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్, బీజేపీ మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు తరచూ వార్తల్లో నిలుస్తూ కొత్త చర్చలకు తవిస్తున్నాయి. ఆ మద్య మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం ఎంతటి సంచలనాలకు తెరతీసిందో అందరం చూశాం. బీజేపీ అప్రజాస్వామ్య రీతిలో అక్రమాలకు పాల్పడుతోందని, అక్రమంగా ప్రభుత్వాలకు కూల్చడమే బీజేపీ అధిష్టానం యొక్క లక్ష్యమని కే‌సి‌ఆర్ ఎప్పటికప్పుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు కే‌సి‌ఆర్ నియంత పరిపాలన చేస్తున్నాడని కమలనాథులు తమదైన రీతిలో టి‌ఆర్‌ఎస్ పై విరుచుకుపడుతున్నారు..

హోరాహోరీగా ఇరు పార్టీల మద్య విమర్శల పర్వం నడుస్తున్న నేపథ్యంలో ఇటీవల జగిరిన సమావేశంలో కే‌సి‌ఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కల్వకుంట్ల కవితను కూడా బీజేపీవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని కే‌సి‌ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కే‌సి‌ఆర్ కూతురికి వేరే పార్టీ నుంచి ఆహ్వానం రావడం ఏంటని సోషల్ మీడియా లో చాలా మంది సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇక కే‌సి‌ఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ బాస్ బండి సంజయ్ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో కే‌సి‌ఆర్ కే స్థానం లేదు మరి ఆయన కూతురికి బీజేపీలో స్థానం ఎందుకుంటుందని, అలాంటి వ్యాఖ్యలు చేస్తూ కే‌సి‌ఆర్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా ఈ ఇష్యూపై ఎమ్మెల్సీ కవితా స్పందించారు. తనకు నిజంగానే బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని, బీజేపీలోని తన స్నేహితుల ద్వారా అనుబంధ సంస్థల ద్వారా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని కవితా స్పష్టం చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఏక్ నాథ్ షిండే వ్యూహం మాదిరిగానే ఇక్కడ కూడా ఈ ప్రపోజల్ తీసుకొచ్చారని, కానీ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు కల్వకుంట్ల కవితా చెప్పుకొచ్చారు. ఇక అలాగే కవితా టి‌ఆర్‌ఎస్ వీడబోతుందని, త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ఇటీవల బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మరింత ఘాటుగా స్పందించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు టి‌ఆర్‌ఎస్ లోనే ఉంటానని కవితా స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఏపీపై మోడీకి నమ్మకం లేదా..అసలెందుకు ?

ఈటెల మళ్ళీ టి‌ఆర్‌ఎస్ లోకి.. బిజెపికి గట్టి దెబ్బే ?

జగన్ పార్టీపై బీజేపీ కుట్ర.. కే‌సి‌ఆర్ మాటల్లో నిజమెంత ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -