Saturday, May 4, 2024
- Advertisement -

ఓటుకు నోటు కేసు ముగిసిపోయిన చాప్ట‌రేనా…

- Advertisement -

రాష్ట్ర‌విబ‌జ‌న త‌ర్వాత తెలంగాణాలో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనె కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈకేసులో బాబు,రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారుల‌ను దొరికిపోయారు. దానికి భ‌య‌ప‌డే హైద‌రాబాద్‌ను వ‌దిలి త‌న మ‌కాం అమ‌రావ‌తికి మార్చార‌నె విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అందులో నిజం లేక‌పోలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓటుకు నోటు కేసు ఈ ఇద్ద‌రు మాఫీ చేశార‌ని ఆరోపించారు. ఇద్ద‌రి మ‌ధ్య‌లో భ‌జ‌న‌శాఖా మంత్రి ఉన్నారు క‌దాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈకేసును మాఫీ చేయ‌డానికి ఇక్క‌డేమొ గ‌వ‌ర్న‌ర్‌… అక్క‌డేమో వెంక‌య్య వంటి పెద్ద‌వారున్నారు క‌దా ఇంకేమ‌వుతుందంటు పొన్నం ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. దీనిపై ర‌చ్చ ర‌చ్చ చేసిన కేసీఆర్ ప్ర‌భుత్వం చివ‌రికి కోర్టులో ఛార్జీసీటుకూడా పెట్ట‌లేక‌పోయింద‌ని అన్నారు.

మీడియా కూడా దీనిని ర‌చ్చ ర‌చ్చ చేసింద‌ని కాని చివ‌రికి ఓటుకు నోటు కేసు ముగిసిన చాప్ట‌రేన‌ని అన్నారు. తెలంగాణా అసెంబ్లీలో రేంత్‌రెడ్డిని స‌స్పెండ్ చేస్తె క‌నీసం బాబు ఒక్క మాట‌కూడా మాట్లాడ‌లేద‌ని విమ‌ర్శించారు. కేసీఆర్‌కు ఎప్పుడూ వ్య‌తిరేకంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని అగ్రిమెంట్లు కుదురుచు కున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కేసీఆర్‌, చంద్ర‌బాబ పాల‌న‌పై త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య అనుసంధాన క‌ర్తగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్ ఉన్నారుగాని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు క‌ల‌సి ఆయ‌న‌కు భ‌జ‌న శాఖ మంత్రి ప‌ద‌విని క్రియేట్ చేస్తే స‌రిపోతుంద‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -