- Advertisement -

ఇడుపుల పాయ‌లో జ‌గ‌న్‌తో కావ‌లి మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి ర‌హ‌స్య భేటీ….

- Advertisement -

త్వ‌ర‌లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌ధ్యంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. టికెట్ల కోసం నేత‌లు త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేసుకుంటున్నారు. తాజాగా కావ‌లి మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ద‌మ‌య్యారు. విష్ణువర్థన్‌రెడ్డి , వైసీపీ అధినేత జగన్‌తో ఇడుపుల పాయలో ఏకాంతంగా చర్చలు జర‌ప‌డం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది

రాబోయే ఎన్నికల్లో తన టిక్కెట్టు విషయమై సంప్రదించారు. వారిద్దరి మధ్య అంతర్గతంగా జరిగిన చర్చల సారాంశం ఏమిటో స్పష్టంగా తెలియదు కాని, ఈ భేటీకి సంబంధించి కావలి నియోజక వర్గంలో రకరకలా ప్రచారాలు ఊపందుకున్నాయి. నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణలు ఆ సమయంలో అక్కడే ఉండగా, విష్ణు, జగన్ లు చాలాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవ‌డం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.

విష్ణు, జగన్ లు చ‌ర్చ‌లు జ‌రుపుతుండానే సీనియర్‌ తెలుగుదేశం నాయకుడు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి స్వయాన బావ అయిన రామకోటారెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అనుచరగణంతో కలిసి వెళ్లి మాట్లాడారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కావలి ప్రాంతంలో రాజకీయ వాతావరణం ఈ రెండు భేటీలతో మరింతగా వేడెక్కింది.

రాబోయే ఎన్నికల్లో కావలి వైసీపీ టిక్కెట్టు ఆశిస్తున్నట్లు, తనకే టిక్కెట్టు ఇస్తానని పార్టీ అధినేత జగన్‌ తనకు మాట ఇచ్చినట్లు విష్ణువర్థన్‌రెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపైనే చర్చ‌లు జ‌రిగినట్లు తెలుస్తోంది.

తనకు టిక్కెట్టు ఇవ్వా లని కోరినట్లు తెలిసింది. టిక్కెట్టు ఇవ్వలేనని, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్‌ అన్నట్లు సమాచారం. అయితే ఈ సమాధానంతో విష్ణువర్థన్‌రెడ్డి సంతృప్తి చెందలేదని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌ రాజకీయ నిర్ణయంపై అనుచరులతో మాట్లాడాలని విష్ణువర్థన్‌రెడ్డి నిర్ణయిం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -