Monday, May 13, 2024
- Advertisement -

బాబుకు రోజు ఇవి లేనిదే ముద్ద దిగదు

- Advertisement -

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అర‌వై ఏళ్ల‌కు పైబ‌డిన వ‌య‌సు ఉన్నప్పటికి.. ఎప్పుడు యాక్టిగా కనిపిస్తారు. అయితే ఆయన ఇంత యాక్టివ్ గా ఉండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు.. అనేది చ‌ర్చించుకుంటుంటారు. నంద్యాల ఉప ఎన్నికల టైంలో.. ఓ భారీ కంటెయిన‌ర్ బాబు ప్ర‌చారం కోసం తీసుకువెళ్ల‌డం, దాన్ని వైసీపీ నేత‌లు అడ్డుకున్న స‌మ‌యంలో బాబు ఆహారంపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. మరి చంద్రబాబు ఏం తింటారు..? ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు.

విజువలైజేషన్.. మితాహారం వంటివి పాటించడమే తన ఆరోగ్య, కలల సాకార రహస్యాలని వెల్లడించారు. మాములుగా అందరు మెడిటేషన్ చేస్తారని చెప్తారు కానీ బాబు విజువలైజేషన్ చేస్తానని తెలిపారు. ఆ ప్రక్రియ గురించి చెప్తూ.. మొదట మూడు నిమిషాలు తన పుట్టుక, బాల్యం గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఆ తర్వాత తాను ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చా.. ఎలా పెరిగా.. ఏం చేయాలి వంటి విషయాలను ఆలోచిస్తానని చెప్పారు. నేను చేయాల్సిన పనుల గురించి సంకల్పం చేసుకుంటాను. నా కలలను సాకారం చేసుకునేందుకు కార్యాచ‌ర‌ణ గురించి విశ్లేష‌ణ చేసుకుంటాను. అలాంటి సంక‌ల్పాలు చాలా సందర్భాల్లో కార్యరూపం దాల్చాయి. విమానాల మరమ్మతు నిర్వహణ యూనిట్, అమెరికన్ వర్సిటీలతో ఒప్పందం వంటివి ఇందులో ఉన్నాయి అని అన్నారు. ఇంత‌కీ ఈ విజువ‌లైజేష‌న్ ఎప్పుడు చేస్తాన‌నే విష‌యాన్ని వివ‌రిస్తూ…ఉదయాన్నే 30 నిమిషాల సేపు వ్యాయామం చేసి అనంతరం విజువలైజేషన్ ప్రక్రియ 30 నిమిషాల సేపు చేస్తానని బాబు తెలిపారు.

ఇక బాబు ఆహారపు అలవాట్ల విషయంకు వస్తే.. తాను బ్రతకడం కోసమే తింటా.. తినడం కోసం బ్రతకనని చెప్పారు. మార్నింగ్.. రాగి లేదా జోన్నతో చేసిన ఇడ్లీ లేదా.. రెండు దోశేలు తిని.. కాస్త టీ తాగుతానని చంద్రబాబు వివరించారు. మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జలతో తయారైన ఆహారం, ఆకు కూరలు తీసుకుంటానని తెలిపారు. సాయంత్రం 6-7 గంటల మధ్య ఒక సూప్, ఒక పండు, రెండు ఎగ్‌వైట్‌లను తింటానని వివ‌రించారు. వీలైనంతవరకు నైట్ టైంలో ఏం తీసుకోనని.. మరి ఆకాలిగా ఉంటే.. ఒక పండు తింటానని తెలిపారు. రోజుకి ఆరు గంటలు నిద్రపోతానై తెలిపారు. మితాహారం, వ్యాయామం, పనిని ఇష్టపడి చేయడం వల్ల అలసట రాదని.. ఇవే తన ఆరోగ్య రహస్యాలని చంద్రబాబు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -