Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌మ్మ‌ల మ‌డుగు పోరులో టీడీపీ, వైసీపీ అభ్య‌ర్తుల ఖ‌రారు

- Advertisement -

మ‌రి కొన్ని వారాల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోనూ ఎన్నిక‌ల కాక మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని అన్ని రాజ‌కీయా పార్టీలు సిద్ద‌మ‌వుతున్నాయి. ప్ర‌ధానంగా సొంత పార్టీలో ఉన్న అసంతృప్తులపై దృష్టిసారించారు. ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే విష‌యంలో ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మ‌ధ్య తీవ్ర‌మైన త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. ప్ర‌తి ఓటూ, ప్ర‌తి సీటూ కీల‌క‌మే అయిన నేప‌థ్యంలో ఎవ‌రికి ఎక్కడ టిక‌ట్ ఇస్తే.. గెలుస్తాము, ఓడుతాము అనే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది.

ఇద‌లా ఉంటే కొన్ని రోజులుగా బాబుకు త‌ల‌నొప్పిగా మారిన జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయితీకి ఎట్ట‌కేల‌కు శుభం కార్డు ప‌డింది. తాజాగా ఇద్దరు నేతలను పిలిపించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గంటపాటు చర్చలు జరిపారు. కడప పార్లమెంట్ టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి అంగీకరించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామసుబ్బారెడ్డి పేరు ఖరారైంది.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన ఆదినార‌య‌ణ రెడ్డిటీడీపీలోకి ఫార్టీ ఫిరాయించి మంత్రిగా సాగుతున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల మ‌డుగు నియోజ‌క వ‌ర్గంలో వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే జ‌మ్మ‌ల మ‌డుగు వైసీపీ అభ్య‌ర్తిగా డాక్ట‌ర్ సుధీర్ రెడ్డి దాదాపు ఖ‌రార‌య్యింది. ఆది నారాయ‌ణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన‌ప్ప‌టినుంచి సుధీర్ రెడ్డి వైసీపీ ఇన్ చార్జ్‌గా కొన‌సాగుతున్నారు.

ఇన్ చార్జ్‌గా సుధీర్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టినుంచి ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకొని వెల్తున్నారు. టీడీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌చారం చేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అభ్య‌ర్తి ఎవ‌ర‌నేది గంద‌ర‌గోలం నెల‌కొంది. అయితే ఇప్పుడు టీడీపీ త‌రుపున జ‌మ్మ‌ల మ‌డుగు అభ్య‌ర్తిగా రామ‌సుబ్బారెడ్డి అని తేలిపోయింది. ఇద్ద‌రిలో జ‌మ్మ‌ల మ‌డుగు ప్ర‌జ‌లు ఎవ‌రిని ఆద‌రిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -