Wednesday, May 15, 2024
- Advertisement -

జ‌న‌సేన పార్టీ ఆట‌లో అర‌టి పండేనా….?

- Advertisement -

ప్ర‌శ్నించ‌డానికె రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీని స్థాపించారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. దానిలో భాగంగానె హైద‌రాబాద్‌లో పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. కార్యాల‌యాన్ని ప్రారంభించాక ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్ట‌లేదు. పేరుకె పార్టీ కార్యాల‌యం అక్క‌డ‌నుంచి ఎటువంటి రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్న దాంట్లో క్లారిటీ లేదు.

అన్ని జిల్లాల్లోను పార్టీ కార్యాల‌యాల‌ను ప్రారంభిస్తామాని గ‌తంలో ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగానె పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాల‌యాన్ని రాజ‌ధాని అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర‌లో మంగ‌ళ‌గిరి వ‌ద్ద పార్టీ ఆఫీసుకోసం స్థ‌లాన్ని లీజుకుని అక్క‌డ పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఏపీలో అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ప‌వ‌న్ సొంతంగా ఇంత‌కంటె స్థిర‌మైన పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించుకోవ‌చ్చుక‌దా. ముసుగులో లీజు వ్య‌వ‌హారం ఎందుకో..?

దీన్ని చూస్తె పార్టీ అట‌లో అర‌టి పండేనా..? షూటింగ్‌ల‌లో గ్యాప్ దొరికిన‌పుడు కాస్తంత రిలాక్స్‌కోసం రాజ‌కీయ హ‌డావుడి చేయ‌డం….త‌ర్వాత షూటింగ్‌ల‌కు వెల్ల‌డం చూస్తున్నాం. శాశ్వ‌త కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే విశ్వాసం పార్టీలో కీల‌క‌మైన వ్య‌క్తుల‌కైనా ఉందా…? లేక‌పోతె క‌నీసీ అధినేత ప‌వ‌న్‌కైనా ఉందా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది అన్ని పార్టీలు రాజ‌ధాని అమ‌రావ‌తిలో పార్టీ కార్యాల‌యాల‌ను ఏర్పాటులో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో త‌మ కార్యాలయాన్ని ప్రారంభించింది. కొన్ని నెల‌ల కింద‌ట వైకాపా కూడా కార్యాల‌యాన్ని స్థాపించింది. త్వ‌ర‌లో టీడీపీ కూడా రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన మరికొన్నిరోజుల్లో చేయబోతోంది. జ‌గ‌న్ ది తాత్కాలికం అయినా శాశ్వ‌త పార్టీ కార్యాల‌యం నిర్మించ‌బోతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో త‌గుదున‌మ్మా అంటూ జ‌న‌సేన పార్టీ కూడా రంగంలోకి దిగుతోంది. మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ఉన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ లేదా తెలుగుదేశం తరహాలో శాశ్వత ఆఫీసు సెటప్ పెట్టుకునే ప్రయత్నంలో వారు లేరు. కేవలం లీజుకు మాత్రం స్థలం తీసుకున్నారు.

3.42 ఎకరాల స్థలాన్ని జనసేన పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు. రాఘవయ్య పేరు మీద లీజు ఒప్పందం రాసుకున్నారు. ఎన్ని సంవత్సరాలకు అనేది ప్రస్తుతానికి బయటకు రాలేదు. త్వరలోనే పార్టీ కార్యాలయానికి శంకు స్థాపన చేస్తారని తెలుస్తోంది.

పుల్ టైమ్ రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్న ప‌వ‌న్ శాశ్వ‌త నిర్మానం గురించి ఆలోచించ‌కుండా …తాత్కాలిక కోటాలో లీజు భవనం అంటే.. పార్టీ కూడా తాత్కాలిక ప్రాతిపదికన నడిచేదేనా? అనే అనుమానాలు అప్పుడే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చిరంజీవిలాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒకే సారి అధిక‌రంలోకి రావాల‌ని ప‌వ‌న్ చూస్తున్నారు. అది కుద‌ర‌క‌పోతె ఏదోక పార్టీలో చిరంజీవిలాగా విలీనం చేస్తారా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తె ప‌వ‌న్ కూడా పార్ట్ టైమ్ పొలిటీషియ‌నేనా …? చూడాలి భ‌విష్య‌త్తులో ఏంజ‌రుగుతుంద‌నేది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -