Wednesday, May 15, 2024
- Advertisement -

తెలంగాణా సీఎం పీఠం మ‌రో సారి టీఆర్ఎస్ దేనా…?

- Advertisement -

దేశంలో అప్పుడే ఎన్నికల హడావిడి మొద‌ల‌య్యింది. ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌ని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం సంకేతాలు పంపుతోంది. . అందుకే తెలుగు నాట కూడా ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో నిర్వ‌హించిన అన్ని స‌ర్వేలల్లో వైసీపీకీ అధికారం ద‌క్కుతుంద‌ని ఫ‌లితాలు వినిపిస్తున్నాయి. ఫ‌లితాలు ఎలా ఉన్నాఅధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య హోరాహోరీ తప్పదనిపిస్తోంది.

అయితే తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటనే విషయమై కేసీఆర్ సర్వే చేయించారు. కేసీఆర్ ఆదేశంమేర‌కు తెలంగాణలో మూడు ఏజెన్సీలు సర్వేలు నిర్వహించగా.. టీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ ఖాయమని రెండింట్లో తేలింది.

రెండు సర్వేల్లోనూ గులాబీ పార్టీకి 100కి పైగా సీట్లు వస్తాయని వెల్లడైంది. ఇక మూడో సర్వే నివేదిక కోసం కేసీఆర్ ఎదురు చూస్తున్నారు. మూడో సర్వే రిపోర్ట్ కూడా వెల్లడైతే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. స‌ర్వేల ఫ‌లితాల ఆధారంగానే వ‌చ్చె ఎన్నిక‌ల్లో నేత‌ల‌కు టికెట్లు ఉంటాయ‌న‌డంలో సందేహంలేదు.

టీఆర్ఎస్‌కు 105 సీట్లు వస్తాయని ఒక సర్వే చెప్పగా, 103 సీట్లొస్తాయని మరో సర్వేలో తేలింది. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని రెండు సర్వేలు చెప్పడం విశేషం. ప్రస్తుతం ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఫ‌లితాలల్లో మార్పులు ఉండొచ్చు. చూడాలి స‌ర్వేలు ఎంత‌వ‌ర‌కు నిజం అవుతాయో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -