Thursday, May 16, 2024
- Advertisement -

పార్టీ మారొద్దని వేడుకున్న బాబు…… తెరాసలోకి జంప్ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

కెసీఆర్ రివేంజ్ స్టోరీ చంద్రబాబులో వణుకు పుట్టిస్తోందా? తాజాగా టిడిపి ఎమ్మెల్యే ద్వారానే ఓటుకు కోట్లు కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు అన్నీ కేసీఆర్ సేకరించాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలే టిడిపి నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలతో పాటు సండ్ర వెంకట వీరయ్య కూడా నిందితుడే. ఇప్పుడు ఈ సండ్ర వెంకట వీరయ్య స్వయంగా కేసీఆర్‌ని అప్రోచ్ అయ్యాడు. తెలంగాణాలో పరిస్థితులు అలానే ఉన్నాయి మరి. ఎమ్మెల్యేలను జంపింగ్ చేయించడానికి కేసీఆర్ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. టిడిపి పూర్తిగా ఖాళీ అయిపోయిన నేపథ్యంలో….మరో పదేళ్ళ వరకూ కనీసం కోలుకునే పరిస్థితిలో కూడా లేని పార్టీలో ఉండి సండ్ర వెంకట వీరయ్య మాత్రం ఏం చేస్తాడు? అందుకే టీఆర్ఎస్‌లోకి జంప్ చేశాడు.

అయితే సండ్ర ప్రయత్నం తెలుసుకున్న చంద్రబాబు మాత్రం పార్టీ మారొద్దని చెప్పి సండ్రను ఓ రేంజ్‌లో అభ్యర్థించాడని సండ్ర సన్నిహితులు చెప్తున్నారు. బాబుకు సన్నిహితంగా ఉండే ఒక మీడియా అధినేత కూడా చెప్పి చూశాడట. అయితే సండ్ర మాత్రం యూజ్ అండ్ త్రో పాలసీకి కేర్ ఆఫ్ అయిన నాయకుడిని నమ్మలేనని కేసీఆర్‌ని, కేటీఆర్‌ని నమ్ముకుంటే నాకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని కరాఖండీగా చెప్పేశాడట. అన్నింటికీ మించి సండ్రను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి ప్రధాన కారణం ఓటుకు కోట్లు కేసు తాలూకూ పూర్వాపరాలు, సాక్ష్యాధారాలన్నీ కేసీఆర్‌కి ఇవ్వాలన్న ఒప్పందమే అన్న విషయమే టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఇప్పుడిక సండ్ర వెంటక వీరయ్య పూర్తిగా కేసీఆర్‌కి సరెండర్ అయిపోయి బాబుకి వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా చేయడం ఖాయం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చంద్రబాబుకు కేసీఆర్ ఇవ్వబోయే రిటన్ గిఫ్ట్ లైఫ్‌లో మళ్ళీ కోలుకోవడానికి అవకాశం లేని స్థాయిలో ఉంటుందా అన్న అనుమానాలను సీనియర్ జర్నలిస్టులు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముందు ముందు ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -