Tuesday, May 14, 2024
- Advertisement -

కాపులు, బీసీల్లో సగం…. దళితులు మొత్తం వ్యతిరేకమేః బాబుతో లగడపాటి

- Advertisement -

విజయవాడ ఎంపి సీటు కోసం పడరాని పాట్లూ పడుతున్నాడు లగడపాటి. అక్కడ నుంచి కేశినేని నాని ఉండడంతో చంద్రబాబుకు కూడా ఏం నిర్ణయం తీసుకోవాలో పాలుపోవడం లేదు. అయితే ఈ గ్యాప్‌లో మాత్రం లగడపాటిని ఫుల్లుగా వాడేస్తున్నాడు బాబు. ఎప్పటికప్పుడు లగడపాటికి ఉన్న నెట్వర్క్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్లనాడిని తెలుసుకుంటున్నాడు. తాజాగా మరోసారి తాను చేయించిన ప్రత్యేక సర్వే వివరాలు బాబుకు ఇచ్చాడు లగడపాటి.

బిజెపి నుంచి బయటకు వచ్చిన తర్వాత…….పవన్ కళ్యాణ్ టిడిపికి దూరమయ్యాక ఆంధ్రప్రదే్శ్ రాష్ట్రంలో కుల సమీకరణాలు ఎలా ఉన్నాయి అన్న అంశంపై లగడపాటితో సర్వే చేయించుకున్నాడు చంద్రబాబు. ఈ సర్వేలో తేలిన లెక్కలన్నీ కూడా 2019 ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబుకే అపనమ్మకం ఏర్పడేలా ఉన్నాయని టిడిపి నేతలు చెప్తున్నారు. 2014లో గెలుపుకు కారణమైన కాపుల ఓట్లు ఈ సారి టిడిపికి అత్యంత తక్కువగా పడనున్నాయి. కాపుల్లో అసంతృప్తులందరూ కూడా జగన్ వైపు వెళ్ళనుండగా పవన్ అభిమానులందరూ పవన్‌కి జై కొట్టనున్నారు. ఇక అనంతపురంతో సహా చాలా జిల్లాల్లో బీసీలందరూ కూడా రుణమాఫీల విషయంలో చంద్రబాబు మోసం చేశాడని భావిస్తున్నారు. 2019లో చంద్రబాబుకు బుద్ధిచెప్పాలన్న నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణలు లగడపాటి సర్వేలో తెలిశాయట. ఇక ఎస్సీఎస్టీల విషయంలో చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులందరూ కూడా అవమానకరంగా ప్రవర్తించారన్న భావన గ్రామస్థాయికి పాకిపోయింది. ఈ సారి దళితుల ఓట్లన్నీ జగన్‌కే పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 2014 ఎన్నికల్లో గెలుపుకు కారణమైన కాపులతో పాటు బీసీలు కూడా ఈ సారి టిడిపికి నష్టం చేయనున్నారు. మరోవైపు చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరి నోటిదురుసు పుణ్యమాని ఈ సారి దళితుల ఓట్లన్నీ కూడా జగన్‌కి అనుకూలంగా ఏకీకృతం కానున్నాయని లగడపాటి తేల్చిచెప్పారట. ఈ కుల సమీకరణాల విషయంలో గణనీయమైన మార్పు వస్తే తప్ప 2019 ఎన్నికల్లో టిడిపి గెలుపుకు అవకాశమే లేదని తేల్చేశాడట లగడపాటి. ఎన్నికలకు కేవలం ఏడాది సమయం కూడా లేని నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలని ఇప్పుడు టిడిపి నేతలందరూ ఆందోళనగా వేచి చూస్తూ ఉండడం ఆ పార్టీ వాస్తవ పరిస్థితి తెలియచేస్తోందని విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -