Sunday, May 5, 2024
- Advertisement -

టార్గెట్ 2019….జగన్ మాస్టర్ ప్లాన్‌ని బయటపెట్టిన నేషనల్ మీడియా… ఈ సారి పక్కా

- Advertisement -

2014ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ నాట చంద్రబాబుకంటే వైఎస్ జగన్‌కే అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉంది అన్న విషయం మేథావులైన రాజకీయ విశ్లేషకులు కూడా ఒప్పుకుంటారు. అయితే అతి విశ్వాసం, చంద్రబాబు రాజకీయ జిమ్మిక్కులను పసిగట్టడంలో వైఫల్యం, పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో ఫెయిల్ అవ్వడంలాంటివి జగన్‌ పార్టీని ఓటమి బాట పట్టించాయి. పవన్ భజన, మోడీ మేనియా కలిసొచ్చి బాబు పవర్‌లోకి వచ్చాడు. అయితే తన లోపాలపై పూర్తిగా అవగాహనకు వచ్చిన వైఎస్ జగన్ ఈ సారి మాత్రం మాస్టర్ ప్లాన్‌తో 2019 ఎన్నికలను ఎదుర్కోనున్నాడు. ఈ మాస్టర్ ప్లాన్ విషయం కూడా ఇప్పుడు నేషనల్ మీడియాలో సెన్సేషనల్ అవుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బరాక్ ఒబామా ఫాలో అయిన సిద్ధాంతాన్ని వైఎస్ జగన్ ఫాలో అవుతున్నాడు. మైక్రో టార్గెటింగ్ స్ట్రాటజీ …..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామాను విజేతగా నిలబెట్టిన స్ట్రాటజీ ఇదే. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ ప్రజలందరినీ మెప్పించేలా విధానాలు రూపొందించడమే మైక్రో టార్గెటింగ్ స్ట్రాటజీ. అన్ని వర్గాల ప్రజల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు జగన్. విలేజ్ స్థాయి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ టీం విశ్లేషణ చేయనుంది. దాదాపు 200 మంది ప్రశాంత్ కిషోర్ టీం లీడర్స్ ఆధ్వర్యంలో రిపోర్ట్స్ సేకరించనున్నారు. ఆ తర్వాత ఆ రిపోర్ట్స్‌ని విశ్లేషించి 2019ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో విధానాలు రూపొందించనున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్‌లో రిపోర్ట్స్ సేకరిస్తూ ఉన్నారట. ఆ రిపోర్ట్స్‌ని వైఎస్ జగన్ జాగ్రత్తగా విశ్లేషిస్తూ 2019ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో సమర్థవంతమైన విధానాలు రూపొందిస్తున్నారని నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. పాదయాత్ర సందర్భంగా ఆల్రెడీ అభ్యుర్థులను ఫైనల్ చేస్తూ వస్తున్న జగన్……ఇప్పుడు ఎన్నికల వ్యూహాలను కూడా రూపొందిస్తున్నాడన్న విషయం వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. చిత్తూరు జిల్లాతో పాటు చంద్రబాబు సొంత ఊరు ఉన్న నియోజకవర్గంలో కూడా ప్రజలు జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలు కూడా సక్సెస్ అయితే మాత్రం 2019లో జగన్‌కి తిరుగుండదని, వైకాపా సంపూర్ణ విజయం సాధించడం ఖాయమని నేషనల్ మీడియా విశ్లేషిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -