మళ్ళీ కవితకు నోటీసులా.. అసలేం జరుగుతోంది ?

Once Again CBI Notices to MLC Kalvakuntla Kavitha
Once Again CBI Notices to MLC Kalvakuntla Kavitha

ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన డిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక నోటీసుల లిస్ట్ లో కవిత పేరు చేర్చడం.. కవితా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్క సరిగా హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఆమె 11న విచారణకు హాజరు అవుతానని చెప్పడంతో నిన్న కవితతో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగించారు.

ఈ విచారణలో కవితపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అమిత్ అరోరా, మరియు ఇతర వ్యక్తులను ఎప్పుడైనా కలిశారా ? డిల్లీలో ఎప్పుడైనా సమావేశం అయ్యరా ? అసలు ఫోన్లు ఎందుకు మార్చల్సి వచ్చింది ? వంటి ఎన్నో ప్రశ్నలను కవిత కు సంధించరాట సీబీఐ అధికారులు. అన్నిటికి తనదైన రీతిలో సమాధానం చెప్పిన కవిత ఎఫ్ఐఆర్ లో లేదనే విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే విచారణ పూర్తి అయిన తారువత.. సమస్య సమసిపోయింది అనుకునే క్రమంలో మరోసారి ఆమెకు నోటీసులను జారీ చేసి షాక్ ఇచ్చింది సీబీఐ.

దాంతో కవితా మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందనేది స్పష్టమౌతోంది. ఇదిలా ఉండగా మరోవైపు కవితా కచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయమని, డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె కూడా నిందితురాలని బీజేపీ నేతలు తరచూ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మళ్ళీ సీబీఐ నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది.దీంతో కవితా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇక రెండవ సారి విచారణ ఎప్పుడు జరగబోతుంది ? ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనున్నాయి వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి.

ఇవి కూడా చదవండి

ఏపీలో బి‌ఆర్‌ఎస్ .. ఎవరికి ముప్పు ?

పవన్ కోసం బాబు కాంప్రమైజ్ కావాల్సిందే..!

ఆంధ్ర మంత్రికి తెలంగాణ మంత్రికి తేడా అదే !