Wednesday, May 22, 2024
- Advertisement -

బీఎస్పీతో బీఆర్ఎస్…కేసీఆర్ కొత్త స్కెచ్

- Advertisement -

తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది. ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీతో పొత్తును ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సుదీర్ఘంగా వీరిద్దరి మధ్య భేటీ జరుగగా సమావేశం అనంతరం మాట్లాడిన కేసీఆర్…బీఎస్పీతో పొత్తును ప్రకటించారు.

సిద్దాంత పరంగా బీఆర్ఎస్ – బీఎస్పీ విధానాలు ఒకే విధంగా ఉన్నాయని అందుకే కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన దళిత బంధు,దళిత సంక్షేమం, రెసిడెన్షియల్ స్కూళ్లు దళిత సంక్షేమానికి ఉదాహరణ అని తెలిపారు. బీఎస్పీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సీట్లు ఇస్తామని…బీఎస్పీ చీఫ్ మాయవతితో మాట్లాడకే పొత్తు చర్చలు జరిగాయని తెలిపారు కేసీఆర్.

ఇక కేసీఆర్‌తో భేటీ ఆనందాన్ని ఇచ్చిందని…సెక్యులర్ పార్టీలన్ని మోడీకి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. త్వరలోనే ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -