సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీలల్లోకి వలసలు వూపందుకుంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇన్నాల్లు ఇతర పార్టీల నేతలను ఫిరాయింపుల ద్వారా పార్టీలోకి చేర్చకున్న బాబుకు ఇప్పుడు సొంత పార్టీ నేతలే జలక్ ఇస్తున్నారు.
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వైసీపీ బలం నానాటికీ పుంజుకుంటోంది. ముఖ్యంగా అభివృద్ధి మంత్రమే జపిస్తూ.. వైసీపీని వీలైనంతగా దెబ్బకొట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి. జిల్లలో టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఆయన వైసీపీలో చేరిక దాదాపు ఖరారు అయిపోంది. నియోజకవర్గంలో మళ్లీ టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడం.. అధిష్ఠానం వేరొకరిని ప్రోత్సహిస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన.. జగన్ చెంతకు చేరిపోబోతున్నారు.
టీడీపీలో కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత పోరు తీవ్రమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడిప్పుడే ఇవి తెరపైకి వస్తున్నాయి. ఇన్నాల్లు బాబు ఎలాగోలా విబేధాలను పైకి రాకుండా చూసుకున్నా ఇప్పుడు మాత్రం పరిస్థితి చేయిదాటిపోతోంది.ఫలితంగా నేతలు ఒక్కొక్కరుగా తలోదారి వెతుక్కుంటున్నారు. తమకు టికెట్ దక్కుతుందని హామీ లభించగానే వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారు
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం లోటస్ పాండ్‌లో కలవబోతు న్నారు. కొన్నాళ్లుగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. చివరకు పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోతులకు, ఆమంచికి రాజీ చేయటంలో చంద్రబాబు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యవహార శైలిపై చినబాబుకు, పెదబాబుకు ఎన్ని సార్లు వివరించినా ఆమెకే వారిద్దరూ మద్దతు తెలుపుతున్నారని ఆమంచి వాపోతున్నారట. దీంతో ముందు జనసేనలో చేరాలిని భావించినా చివరకు జగన్‌ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.2014 ఎన్నికలలో నవోదయం పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై సంచలన విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి కీలకంగా వ్యవహరించారు.
గత ఎన్నికల్లో తనపై ఓడిపోయిన సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందే కాకుండా నియోజకవర్గంలో ఆమెకు ప్రాధాన్యత ఇస్తుండటంతో టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
