Friday, May 24, 2024
- Advertisement -

అసలు సీక్రెట్ ఇదే.. పీకే టార్గెట్ జగన్ కాదు..?

- Advertisement -

ఇటివలే వైసీపీ ప్లీన‌రీకి జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ‌ను వ‌చ్చేలా చేయ‌డం.. పార్టీకి మైలేజ్ వ‌చ్చేలా స్పీచ్ ఇప్పించ‌డం వెన‌క ప్ర‌శాంత్ కిశోర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు టికెట్ ఇవ్వ‌కుండా ఎన్నిక‌ల్లో నిల‌బెట్ట‌కుండా వుండ‌టం కూడా వైసీపీకి మైన‌స్ అయింది గతంలో. కానీ ఈసారి మాత్రం వైఎస్ షర్మిళను పోటీ చేయించాలని భావిస్తున్నాడట వైసీపీ అధినేత జగన్.అదే జరిగితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని భావిస్తోంది ఆపార్టీ క్యాడర్.రాష్ట్రంలో బలమైన మహిళా నాయురాలిగా గతంలోనే షర్మిళ పేరు సంపాదించుకుంది.ఇక ఈసారి ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా పార్టీకి ప్లస్ కానుంది.అదే జరిగితే జగన్ సీఎం అయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి మాత్రం ష‌ర్మిల‌ను ఎన్నిక‌ల్లో పోటీకి దింపేందుకు పీకే స‌రికొత్త వ్యూహం ర‌చించ‌బోతున్నార‌ట‌. ష‌ర్మిళ‌ను పార్ల‌మెంట్ బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌జ‌ల్లో ష‌ర్మిళ‌కు మంచి క్రేజ్ ఉన్నందున దాన్ని వైసీపీకి ఓటు బ్యాంక్ గా మార్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నాడ‌ట పీకే. ష‌ర్మిళ ఎంపీగా పోటీచేస్తే ఓడిపోయే ప్ర‌స‌క్తే లేని నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్వేషిస్తున్నార‌ట‌. జ‌గ‌న్ రాయ‌ల‌సీమ‌ను క్లీన్ స్వీప్ చేస్తే..ష‌ర్మిల అమ‌రావ‌తి ప‌రిస‌రాల్లో 15 నుంచి 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆ 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు బాధ్య‌త‌ల‌ను పూర్తిగా ష‌ర్మిళ‌కే క‌ట్ట‌బెట్టే యోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. మొత్తానికి వైఎస్ ష‌ర్మిళ‌ను ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌డం ప‌క్కా అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మొత్తానికి జగనన్నకు తోడుగా షర్మిళ రాబోతుందన్నమాట. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -