Tuesday, May 14, 2024
- Advertisement -

చంద్ర‌ బాబుకు కు చివ‌ర‌కు 23 సంఖ్య‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన తెలుగు ప్ర‌జ‌లు

- Advertisement -

ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించినా ఇప్పుడు అంద‌రి చూపు 23 సంఖ్య‌పైనె ఉంది. ఈ సంఖ్య ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఎన్నిక‌ల్లో టీడీపీ తుపునుంచి 23 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే గెలిచారు. ఈ నంబర్ ను వింటే.. మరో నంబర్ గుర్తుకు వస్తుంది.

సీఎం చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాక పాల‌న‌పై కంటే విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునేందుకే ఎక్కువుగా దృష్టి పెట్టిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌ని 23 మంది వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌మ వైపుకు తిప్పుకున్నారు. వారిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. మంత్రి ప‌ద‌వులు ఎర‌వేయ‌డంతో పాటు కాంట్రాక్టులు ఇవ్వ‌డం ద్వారా కొంద‌రిని.. డ‌బ్బులు, ఇత‌ర‌త్రా ప్ర‌లోభాల ద్వారా మ‌రికొంద‌రిని టీడీపీలోకి లాగేసుకున్నారు.

పార్టీమారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ పోరాడుతున్న స్పీక‌ర్ కోడెల ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. చేసేదేమిలేక దేవుడు చూస్తున్నాడు….ప్ర‌జ‌లే త‌గిన బుద్ది చెబుతార‌ని జ‌గ‌న్ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. సీన్ క‌ట్ చేస్తె ఈసారి ఎన్నిక‌ల్లో బాబు ఎంత మంది ఎమ్మెల్యేల‌ను కొన్నారో చివ‌ర‌కు ఫ‌లితాల త‌రువాత అంతే మంది ఎమ్మెల్యేలు మిగిలారు.టీడీపీ నుంచి ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే గెలిచారు. ఈ లాజ‌క్ అనుకోకుండా జ‌రిగింద‌నె చెప్పాలి.

టీడీపీ హయాంలో 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కోల్పోయిన జగన్… ఇప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే మిగిల్చారనీ… అదే సమయంలో మే 23న ఫలితాలు రావడంతో… ఈ 23 నంబర్ టీడీపీకి శాపంగా మారిందంటున్నారు నెటిజన్లు. పొలిటికల్ ఈక్వేషన్ అదిరిందిగా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -