Sunday, May 5, 2024
- Advertisement -

చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలో రాసుకున్న ఎన్నిక‌ల వేడి..

- Advertisement -

ఇంకా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాలేదు. అభ్య‌ర్తుల‌ను కూడా పార్టీల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయినా నియోజ‌క వ‌ర్గాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌ల‌య్యింది. తాజాగా చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ, టీడీపీ నేత‌లు నానాపాట్లు ప‌డుతున్నారు. పోలింగ్‌కు స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే త‌మ ప‌రాచారాన్ని మొద‌లు పెట్టారు.

2019 ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నప్పటికీ, రేపోమాపో పోలింగ్ అన్న స్థాయిలో సెగలు రేగుతున్నాయి. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ మొహరించి రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. బాబు సొంత నియోజ‌క ర‌వ్గం చంద్ర‌గిరిపై ఈసారి టీడీపీ జెండా ఎగ‌రేయాల‌ని ఉవ్వీల్లూరుతున్నారు. మ‌రో సారి త‌మ ఉనికిని నిల‌బెట్టుకొనేందుకు వైసీపీ ప‌ట్టుద‌ళ‌తో ఉంది. అయితే ప్ర‌స్తుతం నియోజ‌క వ‌ర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న‌పై టీడీపీ ధీటైన వ్య‌క్తిని రంగంలోకి దించింది.

ఈ నియోజ‌క వ‌ర్గంలో చెవిరెడ్డిపై పోటీకి నాలుగు నెలల ముందే చంద్రగిరికి పులివర్తి నానిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వ్యూహాత్మక రాజకీయాలలో దిట్టగా పేరొందిన చెవిరెడ్డిని ఎదుర్కోవాలంటే అందుకు ధీటైన నేత పులివర్తి నానియే అని చంద్రబాబు భావించారు. అందుకే ఆయనకు చంద్రగిరి అభ్యర్థిత్వం కట్టబెట్టారు బాబుగారు. అందుకు త‌గ్గ‌ట్టు గానే ప్ర‌జ‌ల్లోకి చొచ్చ‌కుపోతున్నారు. పులివర్తి నాని సతీమణి రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. అందువల్ల ఆయన పోటీచేస్తే అటు కమ్మ సామాజికవర్గం ఓట్లతో పాటు ఇటు రెడ్డి సామాజికవర్గం ఓట్లు కూడా పడతాయన్న భావనతోనే బాబు ఆయ‌న‌ను పోటీకి దించారంటున్నారు విశ్లేష‌కులు. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి కూడా త‌న దూకుడు పెంచారు. మ‌రి చంద్ర‌గిరి ప్ర‌జ‌లు ప‌ట్టం ఎవ‌రికి క‌డ్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -