Friday, March 29, 2024
- Advertisement -

టీడీపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప చిలుక జోష్యం అదుర్స్ …

- Advertisement -

ఏపీలో టీడీపీ బురద రాజకీయం మొదలు పెట్టింది. వరదలను రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నా జగన్ పై విమర్శలు మాత్రం తగ్గించడంలేదు. ఇప్పటి వరకు బాబు మొదలు కొని టీడీపీ నేతలందరూ జగన్ ను విమర్శించారు. తాజాగా మాజీ హోమంత్రి చినరాజప్ప విమర్శలకు దిగారు.

వరదలపై ముందస్తు చర్యలు తీసుకోకుండా జగన్ విదేశాలకు వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ పదేపదే చెప్పిన నినాదాన్ని గుర్తు చేస్తూ సెటైర్లు విసిరారు. తాను విన్నాననే జగన్మోహన్‌రెడ్డి.. తాను చూడనంటూ అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు హయాంలో వరదలు వస్తే ఎప్పుడు ఏ బ్యారేజీకి ఎంత నీరు వస్తుందో ముందుగానే గ్రహించి చర్యలు తీసుకునేవారమన్నారు. జులై 25 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వస్తాయని… కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు హెచ్చరించినప్పటికీ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. అధికారులు రివర్స్ టెండరింగ్ చుట్టూ…మంత్రులు బాబు నివాసం చుట్టూ తిరుగుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో పూర్తిగా నీరు నిండకుండానే ఎందుకు కిందకు వదిలారని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి నిల్వ ఎక్కువయ్యే కొద్దీ నీటి మట్టం పెరిగి చంద్రబాబు ఇంట్లోకి నీరు ప్రవేశిస్తుందన్నారు. అమరావతి మునిగిందని, రాజధానిపై విష ప్రచారం చేసే కుట్రకు తెరదీశారన్నారు.

ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ది చెబుతారన్నారు.ఇంకా వాళ్ళ నాటకాలు ఎన్నాళ్ళో సాగవని, ఏది ఏమైనా వారి ఆటలు మూన్నాళ్ళ ముచ్చటే అని, రానున్న ఎలక్షన్లలో మాదే పై చేయి అని చాల కరాఖండిగా చెప్పారు. టీడీపీకీ పూర్వవైభవం వస్తుందని చిలుక జోష్యం చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -