Thursday, May 16, 2024
- Advertisement -

విన్నారా…..! ప్ర‌ధానిని నిర్ణ‌యించేది జ‌న‌సేన పార్టీ అంట‌…..

- Advertisement -

ఆలూలేదు…సూలూలేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న సామెత జ‌న‌సేన పార్టీకీ క‌రెక్ట్‌గా వ‌ర్తిస్తుంది. ఎంతైనా సినిమాల నుంచి పుట్టిన రాజ‌కీయ పార్టీ. రాజ‌కీయాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీలు చేస్తుంటే… ఇప్పుడు మేమ్ త‌క్కువ అన్న‌ట్లు జ‌న‌సేన పార్టీ ముందుంది.

అస‌లు విష‌యానికి వ‌స్తే….2019 ఎన్నిక‌ల్లో ప్ర‌ధానిని ఎవ‌రు నిర్ణ‌యిస్తార‌నేది ప్ర‌జ‌ల చేతుల్లో ఉంటుంది. ఏపార్టీకీ ఎక్కువ సీట్లు వ‌స్తే ఆ పార్టీనేత ప్ర‌ధాని అవుతారు. పూర్తి మెజారిటీ రాకుంటే ఇత‌ర పార్టీల స‌హాయాన్ని తీసుకుంటారు. ఇది రాజ‌కీయాల్లో కామ‌న్‌. కాని తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు పిచ్చ ఆకామెడీనీ త‌లిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధానిని నిర్ణ‌యించేది జ‌న‌సేన పార్టేన‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

కొద్ది రోజుల క్రితం ప్రధానిగా ఎవరుండాలో మననేత చంద్రబాబు నిర్ణయిస్తాడని లోకేష్ బాబు చాన్నాళ్ల కిందటే తేల్చిచెప్పాడు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడే అని పార్టీనేత‌లంతా డంకాబ‌జాయించి చెప్పుకుంటున్నారు. అనేక స‌ర్వేల్లో టీడీపీకి వ‌చ్చేది నాలుగ ఎంపీ సీట్లేన‌ని ఫ‌లితాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

14 ఎంపీ సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు తేల్చింది ఏమీలేదు. ఇక రేపు ఎన్నికల్లో ఎన్నొస్తాయో తెలీదు.టీడీపీ అలాంటి కామెడీ చేస్తుంటే.. ఈ విషయంలో మేమేం తక్కువ? అంటోంది జనసేన. ఈ పార్టీ వర్గాలు కూడా రేపు దేశానికి ప్రధానిగా ఎవరుండాలో తేల్చేది జ‌న‌సేన‌ పార్టీ అంట‌.

జనసేన ఇచ్చే సపోర్టును బట్టే ఎవరో ఒకరు ప్రధాని అవుతారని ఈ పార్టీ వాళ్లు అంటున్నారు. జనసేన పార్టీకి బ్రహ్మాండమైన వేవ్ ఉందని.. భారీగా ఎంపీ సీట్లను నెగ్గేస్తుందని.. వాటితో ప్రధానిగా ఎవరుండాలో పవన్ డిసైడ్ చేసేస్తారని ఈ పార్టీ వాళ్లు బాకా ఊదుతున్నారు. వైసీపీ వాళ్లు మాత్రం ఎవరు రాష్ట్రానికి హోదా అంటే వాళ్లకే సపోర్ట్ అంటున్నారు. టీడీపీ, జనసేనలు మాత్రం.. ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేది మేమే అంటున్నాయి. జనసేనతో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేస్తాం అంటే దీన్ని మామూలు కామెడీ అనాలా లేకా పిచ్చ‌కామెడీ అనాలో ప్ర‌జ‌లే తేల్చుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -