- Advertisement -

గ్లామర్‌ను గ్లామర్‌తోనే కొట్టాలనె చంద్ర‌బాబు వ్యూహం ఫ‌లిస్తుందా….

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజా దూకుడుకు చెక్ పెట్టేందుకు టిడిపి నానాపాట్లు ప‌డుతోంది. రోజాను దెబ్బ కొట్టేందుకు బాబు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అసెంబ్లీనుంచి సస్పెండ్ చేయ‌డం, పార్టీ మారుతోంద‌ని మైండ్‌గేమ్ మొద‌లు పెట్టిన వాట‌న్నింటికి రోజా ఘాటైన స‌మాధానం ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాక‌పోవ‌డంతో కొత్త స్కెచ్‌కు తెర‌తీశారు చంద్ర‌బాబు.

ఏ కులం నాయ‌కుల‌కు …ఆకులం నాయ‌కుల‌తోనె విమ‌ర్శ‌లు చేయించి రాజ‌కీయంగా పైచేయి సాధించ‌డం బాబు వెన్నుతో పెట్టిన విద్యే. ఇలాంటి కిటుకును రాజ‌కీయాలు ప‌రిచ‌యం చేశాడ‌నె చెప్పుకోవాలి. రాజ‌కీయాల్లో స‌రికొత్త ట్రెండ్‌ని ప‌రిచ‌యం చేసింది బాబుగారె. ఇప్పుడు అదే సూత్రాన్ని వేరే కోనంలో ప్ర‌యేగిస్తున్నారు.

రోజాను ఎదుర్కోవాలంటె టిడిపి కి స‌రైన ఆప్స‌న్ లేదు. ప్ర‌స్తుతం ఆమెను ఎదుర్కొనేందుకు పార్టీలో అచ్చెన్నాయుడు, బోండా ఉమామ‌హేశ్‌వ‌ర‌రావు, బుచ్చ‌య్య‌చౌద‌రి….వీనితోపాటు వంగ‌ళ‌పూడి అనిత‌, పీత‌ల సుజాతను ఉసిగొల్పేవారు. అయిన‌ప్ప‌టికి రోజాని రాజకీయంగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

ఇలా కాదనుకున్నారో ఏమోగానీ వాణీ విశ్వనాథ్‌ను రంగంలోకి దింపి రోజాకు రాజకీయంగా కూడా చెక్ చెప్పాలని టిడిపి భావిస్తోంది. విమర్శల రూపంలో కాకుండా సినీ గ్లామర్‌తో దెబ్బ కొట్టాలని భావిస్తోంది. టీడీపీలో చేరే విషయమై వాణి విశ్వనాథ్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. పైగా, రోజా మీద న‌గ‌రి నుంచి పోటీ చేస్తానని ప్ర‌క‌టించారు.

బాబు అవ‌కాశ రాజ‌కీయీల గురించి వాణివిశ్వ‌నాథ్‌కి తెలిసిన‌ట్లు లేదు. సినీ నటి జయప్రద, రోజా రాజకీయ రంగ ప్రవేశం చేసింది టీడీపీ నుంచి జ‌రిగింది. చివ‌ర‌కి ఇద్ద‌రిని బ‌య‌ట‌కు ఎలాపంపారో అంద‌రికి తెలిసిందే. వాణి విశ్వనాథ్‌ని కూడా రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి పెద్ద విషయమేమీ కాదు.

గ్లామ‌ర్ ప‌రంగా వాణివిశ్వ‌నాథ్ ద్వారా రోజాకి చెక్ పెట్టచ్చేమోగాని రాజ‌కీయంగా మాత్రం అసాధ్య‌మ‌నె చెప్పాలి. ఇప్ప‌టికే రాజ‌కీయంగా రాటుదేలారు. త‌న మాట‌ల‌తూటాల‌తో చంద్ర‌బాబు ఆయ‌న బ్యాచ్‌కు నిద్ర‌లేకుండా చేస్తోంది. మ‌రి వాణి విశ్వ‌నాథ్ రోజా వాగ్థాటి మాట‌ల బాణాల‌కు త‌ట్టుకుంటుందా. చూడాలి ఏం జ‌రుగుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -