Monday, May 13, 2024
- Advertisement -

తేలు కుట్టిన దొంగ‌లా చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లు…. అర‌వ‌లేరు.. క‌ర‌వ‌లేరు..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెల్లినా మ‌న‌శ్శాంతి లేకుండా పోతోంది. టీటీడీపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నార‌నె వార్త‌ల‌తో బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ఆస్వాధించాల్సిన బాబుకు…..దీపావ‌ళిని సెల‌బ్రేష‌ట్ చేసుకోవాల్సిన పార్టీకి ప్ర‌శాంత‌త లేకుండా పోతోంది.

కార‌నం రేవంత్‌రెడ్డి ప‌ర్టీమారుతున్న వ్యాఖ్య‌లు, ఏపీ మంత్రుల‌పై పేల్చిన బాంబుకుల తెలుగుదేశం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. వేరే ప‌ర్టీ అయితె ఈ పాటికి ఎదురుదాడి మ‌మూలుగా ఉండ‌దు. త‌న మీద ఒక రాయిప‌డేలోపు అవ‌త‌ల వాల్ల‌మీద వెయ్యి రాళ్లు వేయ‌డం పార్టీ ప్ర‌త్యేక‌త‌.

దీని కోసమని తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రత్యేకమైన బలం, బలగం ఉంది. తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ లు అయితేనేం.. ఆస్థాన మీడియా టీడీపీ ప్రత్యర్థి వర్గాన్ని చీల్చి చెండాడేవి. రేవంత్ విషయంలో మాత్రం తెలుగుదేశం గొంతులు పెగలడం లేదు. లోకేష్ బాబు, దేవినేని ఉమ.. వంటి వాళ్లు అయితేనేం, రేవంత్ మాటల్లో నలిగిన పరిటాల, పయ్యావుల, యనమలలు అయితేనేం.. ఆ టీడీపీ నేత మాటలపై అన్నీ మూసుకుని కూర్చున్నారు.

రేవంత్ రెడ్డి చెప్పినట్టు.. ఏపీ తెలుగుదేశం నేతలు తమ వ్యాపారాల్లో, వ్యక్తిగత వ్యవహారాల్లో కేసీఆర్ సహకారం పొందుతూ ఉండకపోతే ఎంత హడావుడి చేసేవాళ్లు? రేవంత్ రెడ్డి మాటల సెగతో వీళ్లు పీకి పందేరేసే వాళ్లు. ఒకరి తర్వాత మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ పై దుమ్మెత్తిపోసే వాళ్లు.

అయితె ప్ర‌స్తుతం రేవంత్‌రెడ్డి విష‌యంలో తేలు కుట్టిన దొంగల్లే మారింది. రేవంత్ మాటలన్నీ అబద్ధం, అతడు చెప్పినట్టుగా ఏమీ జరగడం లేదు అనే మాటే తెలుగుదేశం నుంచి వినిపించడం లేదు. ఇలాంటి సమయంలో రేవంత్ రూపంలో ఇంత పెద్ద ఉత్పాతం వస్తే.. వీళ్లు కామ్ గా ఉన్నారు. తెలుగుదేశం పైకి క‌నిపిస్తున్న రూపంవేరు….లోప‌లి రూపం వేర‌నె విష‌యం ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతోంది. రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజంలేక‌పోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -