Thursday, April 25, 2024
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీదే అధికారం …!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019లో జ‌ర‌గనున్న ఎన్నిక‌ల‌లో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని నేష‌న‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది.2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉన్న పళంగా ఎన్నికలు జరిగినా…టీడీపీ కన్నా వైసీపీకి దాదాపు 10 శాతానికి పైగా ఓట్లు పోలవుతాయని జాతీయ సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో జాతీయ సర్వేలో కూడా వైసీపీకి అత్యధిక ఓట్లు పోలవుతాయని వెల్లడైంది.

జిల్లాల‌ వారీగా చేసిన ఈ స‌ర్వేలో ఏపీలో వైసీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు ఈ సర్వే నిదర్శనం. ఏపీలో ఆయా ప్రాంతాల వారీగా వైసీపీ – టీడీపీ – జనసేలకు పోలయ్యే ఓట్ల శాతంలో చాలా తేడా ఉంది. వైసీపీకి దరిదాపుల్లో కూడా టీడీపీ లేకపోవడం గమనార్హం.ఇక జనసేనకు నామ మాత్రంగానే ఓట్లు పోలవుతాయని సర్వేలో వెల్లడైంది. వైసీపీకి 104 సీట్లు దక్కుతాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఇక టీడీపీకి 68 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. జనసేనకు 2 – బీజేపీ ఒక సీటు వస్తాయని సర్వేలో స్పష్టమైంది. 2019 ఎన్నిక‌ల‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని ఈ స‌ర్వే తెల్చేసింది.

నేష‌న‌ల్ స‌ర్వే జిల్లాల వారికి ఇచ్చిన ఓట్ల శాతం ఎలా ఉందో తెలుసుకుందాం…….

రాయలసీమ: వైసీపీ: 70 శాతం – టీడీపీ: 30 శాతం

నెల్లూరు: వైసీపీ: 90 శాతం – టీడీపీ: 10 శాతం

ప్రకాశం: వైసీపీ: 60 శాతం – టీడీపీ: 40 శాతం

గుంటూరు & కృష్ణా: వైసీపీ: 40 శాతం – టీడీపీ: 60 శాతం

ఉభయ గోదావరి జిల్లాలు: వైసీపీ: 50 శాతం – టీడీపీ: 50 శాతం

ఉత్తరాంధ్ర: వైసీపీ: 55 శాతం – టీడీపీ: 45 శాతం

వైసీపీ ఓట్ల షేర్ : 56 శాతం

టీడీపీ ఓట్ల షేర్ : 37.5 శాతం

జనసేన ఓట్ల షేర్ : 4.5 శాతం

కాంగ్రెస్ ఓట్ల షేర్: 1 శాతం

బీజేపీ ఓట్ల షేర్: 1 శాతం

సీట్ల అంచనా:వైసీపీ:104

టీడీపీ:68

జనసేన:2

కాంగ్రెస్: 0

బీజేపీ:1

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -