- Advertisement -

షర్మిల వచ్చే ఎన్నికల్లో.. ఎక్కడ నుంచి పోటీ చేస్తుందంటే..?

- Advertisement -

2019 ఎన్నికల బరిలోకి వై.ఎస్‌.షర్మిల దిగాలని నిర్ణయం తీసుకున్నారా..? అయితే అవుననే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఇంతకాలం పార్టీ కార్యక్రమాల్లో కనిపించి.. పార్టీ పనులు చూసుకున్న ఆమె.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

పోయిన ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికి.. ఆమె పోటీ చేయలేదు. అయితే, పులివెందుల, విశాఖపట్నం, కడప, కమలాపురం,ఒంగోలులో కుటుంబసభ్యులే పోటీ చేయటంతో చివరకు షర్మిల విరమించుకున్నట్లున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి పోటీ చేయటం లేదని సమాచారం. అదేవిధంగా వైఎస్ విజయమ్మ కూడా పోటీకి దూరంగానే ఉంటారట. అందుకనే.. షర్మిల పోటీకి లైన్ క్లియరైనట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం లేదా ఒంగోలు ఎంపీ స్థానాల్లో ఎక్కడో ఓ చోట పోటీ చేయటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు సీనియర్లు మాత్రం గత ఎన్నికల్లో జగన్ తల్లి వైఎస్‌.విజయలక్ష్మి ఓడిపోయిన విశాఖలోనే షర్మిలను పోటీ చేయించి గెలిపించుకోవడం ద్వారా సత్తా చాటాలని చెబుతున్నారట. చూడబోతే వచ్చే ఎన్నికల్లో ఇటు టిడిపి అటు వైసీపీ తరపున చాలా పెద్ద తలకాయలే పోటీలో ఉండేట్లున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -