Monday, April 29, 2024
- Advertisement -

విలీనంపై క్లారిటి వచ్చేనా?

- Advertisement -

హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడ్యబ్లూసీ) సమావేశాలు జరుగుతున్నాయి. ఇక రేపు తక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహించనుంది. దాదాపు 10 లక్షల మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సభలో పెద్ద ఎత్తున చేరికలుండనున్నాయి. ఇవాళే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మలతో పాటు బీజేపీ నుండి కూడా సీనియర్ నేతలు పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

ఇక పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్‌ రాగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల…ఆమెతో భేటీ కానున్నారు. గత నెలలో సోనియాతో పాటు రాహుల్‌తో భేటీ అయ్యారు షర్మిల. తన పార్టీ విలీనానికి సంబంధించిన చర్చతో పాటు రాజకీయ భవిష్యత్‌ వంటి వాటి గురించి ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే నెల రోజులు గడుస్తున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం షర్మిలను కలిసే ప్రయత్నం చేయలేదు. దీంతో షర్మిల ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ఆ పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ షర్మిల…సోనియాతో భేటీ అవుతున్నారన్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తనతో పాటు తన పార్టీలోని కొంతమంది నేతలకు సీట్లు అడుగుతున్న షర్మిల. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా పాలేరు నుండి బరిలోకి దిగేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు షర్మిల. తన ఆఫీస్‌ని సైతం ప్రారంభించారు. ఇక ఇదే స్ధానాన్ని మాజీ మంత్రి తుమ్మల కూడా ఆశిస్తున్నారు. దీంతో సోనియాతో భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనానికి సంబంధించి ఇవాళైన క్లారిటీ వస్తుందా లేదా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -