Wednesday, May 15, 2024
- Advertisement -

హైరానా ప‌డుతున్న చంద్ర‌బాబు…గ‌ట్టెక్క‌డం ఎలా…?

- Advertisement -

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ టీడీపీకీ వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నాయి. రోజు రోజుకి టీడీపీ గ్రాప్ ప‌డిపోతుంటే మ‌రో వైపు వైసీపీ గ్రాప్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. మ‌రో వైపు జాతీయ స‌ర్వేలు, బాబు సొంత స‌ర్వేల‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. దీంతో బాబు అండ్ కో హైరానా ప‌డుతున్నారు.

ఇక సీట్ల విష‌యానికి వ‌స్తే రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలుపుకు మొత్తం 74 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో యాభైకి తక్కువ కాకుండా వైసీపీ గెలుచుకుంటుందని సర్వేలు గంటాప‌థంగా చెప్తున్నాయి. ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను బాబు జీర్నించుకోలేక పోతున్నారు.

మిగిలి జిల్లాల్లో ఏడు జిల్లాల్లో వైసీపీకి మరో నలభై సీట్లు ఈజీగానే వస్తాయని, మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ ని వైసీపీ దాటి పవర్ లోకి రావడం ష్యూర్ అంటూ సర్వేలు చెప్పడంతో టీడీపీలో కలవరం మొదలైందని అంటున్నారు. ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించు కొనేందుకు నానా పాట్లు పుడుతున్నారు చంద్ర‌బాబు.

ఇక టీడీపీ విషయానికి వస్తే గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లోనే బలం బాగా ఉన్నట్లుగా సర్వేలు సూచిస్తున్నాయి. అయితే అక్క‌డ అక్కడ జనసేన పాగా వేస్తుందన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ రెండు జిల్లాల్లో  ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన టీడీపీకీ భారీగా న‌ష్టం క‌లిగించే అవ‌కాశంఉంది.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా అది వర్కఔట్ కాదని బాబు సహా అంతా లోలోపల అపనమ్మకంతోనే ఉన్నారట. పొత్తు వ‌ల్ల కాంగ్రెస్‌కు లాభం త‌ప్ప టీడీపీకీ లాభం ఉండ‌ద‌ని పార్టీ నాయ‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. క మిగిలిన వారు సైతం ఈ పొత్తు ఇష్టపడక రాజీనామాలు చేస్తున్నారు.

వైసీపీని నిలువరించడం ఎలాగో తెలియక టీడీపీ హై కమాండ్ నానా హైరానా పడుతోందట. సర్వేలు ఏ నెలకు ఆ నెల వచ్చినవి మాత్రం టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని స్పష్టంగానే చెబుతున్న వేల పొత్తు బాబును ఎంత‌మేర‌కు గ‌ట్టెక్కిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -