Sunday, May 5, 2024
- Advertisement -

ఇది ఆమరణదీక్ష కాదు… ఆంధ్రజ్యోతి చెప్పిన అసలు కథ

- Advertisement -

పొరపాటుగా ప్రచురించిందో లేక .. మరో ఉద్దేశంతో బయటపెట్టిందో గానీ.. సీఎం రమేష్ దీక్షపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అసలు విషయాన్ని కక్కేసింది. అందరూ సీఎం రమేష్ చేస్తున్నది ఆమరణ దీక్ష అనుకుంటుంటే.. అదేమీ లేదు ఇదంతా ముందస్తు రూట్‌మ్యాప్‌ ప్రకారమే నడుస్తున్న డ్రామా అని ఆంధ్రజ్యోతి కథనంతో తేలిపోయింది.

సీఎం రమేష్‌ దీక్షకు దారి తీసిన పరిణామాలను వివరిస్తూ ఏబీఎన్ కథనాన్ని ప్రసారం చేసింది. కడప ఉక్కు కోసం దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పగానే.. ఆయనకు తెలియకుండానే దీక్షకు ఏర్పాట్లు చేసేశారని వివరించింది. అంతటితో ఆగలేదు. సీఎం రమేష్‌ ఎన్ని రోజులు దీక్ష చేస్తారు.. మధ్యలో తేడా జరిగితే ఏం చేయాలి అన్నది కూడా నిర్ణయించుకునే రంగంలోకి దిగారని స్పష్టం చేసింది.

సీఎం రమేష్ దీక్ష ఏర్పాట్లపై కీలక మంత్రి ఒకరు స్పందిస్తూ.. సీఎం రమేష్ ఓ తొమ్మిది రోజుల పాటు దీక్ష చేయడానికి మానసికంగా సిద్ధమయ్యారని.. ఒకవేళ ఆలోపే అవసరమైతే ప్రభుత్వం మాదే కాబట్టి.. డాక్టర్ల సిఫార్సుతో ఆస్పత్రికి తరలిస్తామని మంత్రి వివరించినట్టు ఏబీఎన్ వెల్లడించింది.

నిజానికి ఆమరణదీక్ష అంటే అనుకున్నది సాధించే వరకు ప్రాణాలు పోయినా సరే వెనక్కు తగ్గకపోవడం. కానీ సీఎం రమేష్‌ది ఆమరణ దీక్ష అంటూ ప్రచారం చేస్తున్నా… దీక్షకు ముందే ఎన్ని రోజుల పాటు దీక్ష చేయాలి… అవసరమైతే ఆస్పత్రికి ఎలా తరలించాలి అన్న ప్రణాళిక సిద్ధం చేసుకునే రంగంలోకి దిగినట్టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెబుతున్న దానిపై బట్టే అర్థమైపోతోంది.

సో… కడప ఉక్కు సాధించే వరకు వెనక్కు తగ్గిది లేదు.. అవసరమైతే పొట్టిశ్రీరాములుగారి తరహాలో ప్రాణాలొదిలేందుకైనా సిద్ధమన్నట్టు సీఎం రమేష్ అండ్ బ్యాచ్ ఇస్తున్న బిల్డప్ ఉత్తిదేనన్న మాట. ఇది ఆమరణ దీక్ష కాదు.. ముందస్తు స్క్రీన్‌ప్లేతో నడుస్తున్న నవరాత్రుల దీక్ష అన్న మాట!. కాబట్టి కడప ఉక్కు కోసం సీఎం రమేష్ పరిస్థితిని తన ప్రాణాల మీదకు ఎక్కడ తెచ్చుకుంటారో అని ఆందోళన చెందేవాళ్లంతా రిలాక్స్ అయిపోవచ్చు. అయినా ఇలాంటి నిజాలను ఇలాంటి సమయంలో బయటపెడితే ఎలా జ్యోతి!.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -