Sunday, May 5, 2024
- Advertisement -

అందరిలో ఎందుకీ భయం? నల్లడబ్బుతో నలుపయ్యారా?

- Advertisement -
All you need to know:Why every business man afridi has not changed 500, 1000 rupees..?

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఒకేసారి దేశం మొత్తం షాక్‌కు గురయ్యింది. ఇంకోరకంగా చెప్పాలంటే కొంత అయోమయం, భయం, అనుమానం వచ్చాయి. స్వయంగా ప్రధానితో సహా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా ఏ ఇబ్బంది లేదు, మీ డబ్బులను బ్యాంక్‌లో వేసుకుని మార్చుకోవచ్చని చెప్పారు. అయితే ఇన్ని కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇలాంటి నిర్ణయాన్ని తట్టుకోవడానికి కొంత సమయం తప్పకుండా అవసరమౌతుంది.

కాబట్టి ప్రజలంతా బ్యాంకులలో జమ చేసిన డబ్బును తిరిగి తీసుకోవడానికి కొంత పరిమితిని విధించారు. అది కూడా కొన్ని రోజుల పాటే. దీన్ని బట్టి వ్యాపారులంతా ఎటువంటి భయం లేకుండా కొనుగోలు చేసే వారి వద్ద నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్లీ వారు తిరిగి వాటిని బ్యాంకులలో మార్చుకోవచ్చు. కానీ ఎక్కడా అలా జరగడంలేదు. పెద్ద వ్యాపార సంస్థలతో పాటుగా చిరు వ్యాపారులు కూడా రద్దయిన నోట్లు తీసుకోవడానికి జంకుతున్నారు. అందుకు వాళ్ల వ్యాపారం నష్టపోయినా లెక్కచేయడం లేదు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమేజాన్‌ వంటి పెద్ద ఈ – కామర్స్ సంస్థలు కూడా క్యాష్ ఆన్ డెలివరి సేవలను దద్దు చేసింది. ఇక పెట్రోల్ బంకులైతే పెద్దనోట్లు తీసుకోవడానికి ససేమిరా ఒప్పుకోవడంలేదు. ఇలా ఇబ్బందులతో సామాన్య ప్రజలకు సదరు వ్యాపారులతో గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఎందుకు? దేనికి భయపడుతున్నారు. వాళ్లు చేస్తున్న వ్యాపారం కరెక్టుగా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే దీని వెనుక మూడు సమాధానాలున్నాయి. పన్ను, నల్లధనం, భయం

పన్ను…

నోట్లను రద్దు చేయడంతో పాటు ఆ నోట్ల స్థానంలో కొత్తవి పొందాలంటే లేదా వందల్లోకి మార్చుకోవాలన్నా వాటిని బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో జమ చేయడం ఒక్కటే మార్గం. దీంతో అప్పటి వరకు దాచుకున్న డబ్బును కూడా తీసుకెళ్లి బ్యాంక్‌లో వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి రెండున్నర్ర లక్షల లోపు అయితే ఎటువంటి లెక్క అడగకపోయినా అంతకు మించితే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బుకు లెక్క చపించమంటూ అడుగుతారు. అంతేకాదు ఒక గుర్తింపు కార్డు మీద ప్రతిసారి ఎంత డబ్బు జమ అవుతుంది అనే పరిశీలన ఉంటుంది. దీంతో పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వచ్చే రాబడి కంటే ఎక్కువ డబ్బులను బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే మాత్రం 200 శాతం పన్ను వసూలు చేయనున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కన్నేసి ఉంచింది. దీంతో టాక్స్ కట్టే విషయంతో పాటు, వ్యాపారంలో అక్రమంగా సంపాదించగలుగుతున్న డబ్బుల లెక్క చెప్పాల్సిన అవసరం ఉండటంతోనే పెద్ద సంస్థలు భయపడుతున్నాయని విశ్లుషకులు అంటున్నారు.

బ్లాక్‌మనీ..

వ్యాపారం చేసే వారు వాస్తవ రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్మడం ద్వారా సేవలను పొందే వ్యక్తి నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుని అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ నల్లధనాన్ని మళ్లీ తేలికగా తెల్లధనంగా ఉపయోగించేస్తున్నారు. పన్ను కట్టే పరిధిలోకి ఈ డబ్బులు రావడంలేదు. దీంతో కేవలం కొన్ని రోజుల పాటే ఈ ఇబ్బంది కాబట్టి ఆ మేరకు తమ వ్యాపారం నష్టపోవడానికైనా సిద్దపడుతున్నారు కానీ రిస్క్ తీసుకోదలుచుకోవడం లేదు.

భయం..

ఇక మూడోది భయం. ఇది చిరు వ్యాపారులకు గ్రామీణ వాసులకు వర్తిస్తుంది. ఆటో నడుపుకునే వారి నుంచి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారు, కూలి పని చేసుకునే వారు ఇలా అంతా భయంతో రూ. 500 రూ. 1000 నోట్లు తీసుకోవడం లేదు. ఒకటి వాటిని వెంటనే ఉపయోగించే అవకాశం ఉండదు. రెండు వాటిని మళ్లీ బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాక అసలు బ్యాంకుల్లోనైనా తీసుకుంటారో లేదో అనే అనుమానాల్లో ఉన్నారు. అసలుకే నోట్లన్నీ రద్దయ్యాయా! అనే షాక్ నుంచి ఇంకా కోలుకోని పరిస్థితిలో ఉన్న వీరిలో ఇలాంటి అనుమానాలు సహజమే కదా..

దేశంలో ఉన్న మొత్తం డబ్బు బ్యాంకుల ద్వారా ప్రభుత్వ కనుసన్నల్లోకి వెళుతుంది. దోచుకుందాం, దాచుకుందా అనే వారికి కష్టమే. ఎంత రాబడి వస్తుంది, ఎంత సేవ్ చేస్తున్నారనే సరిచూసే అకౌంటింగ్ లెక్కలు వేయడం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇలా రద్దయిన నోట్లు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్న పెద్ద సంస్థల వెనక మాత్రం నల్లధనం ఉంది. నిజానికి మోదీ తీసుకున్న ఈ సడెన్ నిర్ణయంతో ఇంత మంది పెద్ద నోట్లను తీసుకోవడానికి జంకుతున్నారంటే వారు అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులు ఏ స్థాయిలో ఉందో అనేది చర్చ. ఇలా దేశం మొత్తం మీద ఉన్నారన్నమాట. ఇదంతా నల్లడబ్బేగా? అనేది సామాన్యుడి ప్రశ్న. కామన్ మాన్ ఇలా అనుకుంటున్నప్పటికీ ఈ సో కాల్డ్ మీడియా సంస్థలన్నీ ఇలా ఎందుకు ప్రశ్నించడంలేదు. అసలు ఈ ఊసే ఎందుకు ఎత్తడం లేదు? ఈ కోణంలో ఎందుకు విశ్లేషించడం లేదు అనేది అంతుచిక్కని అసలు విషయం.. 

మరో విషయమేమంటే, లక్ష్మీదేవీని డబ్బు రూపంలో కొలిచే ప్రజలంతా ఒక్కసారిగా మారిపోయి వాటిని చిత్తు కాగితాల్లాగా చూసే పరిస్థితికి రావడం ఆశ్చర్యకరం. ఇప్పటి వరకు ఎంతో విలువనిచ్చిన ఈ పెద్ద నోట్లకు చిల్లులు పెట్టి, కొద్దిగా చింపేసి, పొట్లాలుగా మార్చిన పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంటే డబ్బుకు విలువుంటేనే దేవుడికి విలువ? అనేది మదిలో మెదిలో మరో ప్రశ్న..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -