Wednesday, May 15, 2024
- Advertisement -

కడుపునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి !

- Advertisement -

కడుపునొప్పి అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సాధారణమైన ఆరోగ్య సమస్య. అయితే కడుపు నొప్పి వచ్చినప్పుడు నిర్లక్షం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కడుపునొప్పి వస్తే ఆ భాద వర్ణనాతీతం. కొన్ని సార్లు ఈ కడుపునొప్పి తీవ్రత అధికంగా ఉండడం వల్ల సర్జరీ కూడా పడే అవకాశం లేదపోలేదు. అందువల్ల కడుపునొప్పి విషయంలో నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కడుపునొప్పిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల లేదా అజీర్తి వల్ల కూడా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. అయితే అలా వచ్చే సాధారణ కడుపునొప్పి ని తగ్గించడానికి మనకు ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా మన వంటింట్లో దొరికే అల్లం, సోంపు, తేనె వంటివి కడుపునొప్పిని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగ పడతాయి. ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకొని, వాటిలో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి, కాస్త చల్లర్చిన తరువాత ఈ మిశ్రమానికి ఒక టీ స్పూన్ తేనె కలిపి సేవించాలి. ఇలా చేయడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలా కాకుండా అల్లం యొక్క రసాన్ని కషయంలా తీసుకొని ఆ డైరెక్ట్ గా సేవించిన కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇక పుదీనా ఆకులు కూడా కడుపునొప్పిని తగ్గించడంలో చక్కగా ఉపయోగ పడతాయి. కొన్ని పుదీనా ఆకులు తీసుకొని నీటిలో మరింగించి ఆ నీటిని తాగడం ద్వారా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. తద్వారా కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక సొంపు కూడా కడుపునొప్పిని తగ్గించే గుణం కల్గి ఉంటుంది. ఒక కప్పు నీటిలో ఒక చెంచా సొంపు వేసి బాగా మరింగించి. చల్లర్చిన తరువాత ఆ మిశ్రమానికి ఒక టీస్పూన్ తేనె కలిపి సేవించడం ద్వారా కూడా కడుపునొప్పి కి చెక్ పెట్టవచ్చు. ఇవే కాకుండా ఒక గ్లాస్ నిమ్మరసంలో కాస్త బేకింగ్ సోడా వేసుకొని తాగడం ద్వారా కూడా గ్యాస్ సమస్య తగ్గి కడుపునొప్పి ఉంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే టిప్స్ !

పుడ్ పాయిజన్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఇంటర్నెట్ లేకపోయిన అమౌంట్ సెండ్ చేయండిలా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -