Sunday, May 19, 2024
- Advertisement -

ఇంటర్నెట్ లేకపోయిన అమౌంట్ సెండ్ చేయండిలా!

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరూ యూస్ చేస్తూ ఉంటారు.. మన రోజు దినచర్యలో స్మార్ట్ ఫోన్ ద్వారానే చాలా పనులు చేస్తూ ఉంటాము. ఇతరులతో ఫోన్ మాట్లాడడానికి, లేదా మెసేజ్ చేయడానికి, లేదా గేమ్స్ అడడానికి ఇలా చాలా రకాలుగా మొబైల్ నూ యూస్ చేస్తూ ఉంటాము. కేవలం కాలక్షేపనికి మాత్రమే కాకుండా మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతరులకు అమౌంట్ పంపించాలన్న మొబైలే వాడుతూ ఉంటాం. ఇక అమౌంటు ఇతరులకు పంపడానికి ప్రస్తుతం ఫోన్ పే, పేటియమ్, గూగుల్ పే, వంటి ఎన్నో రకాల పేమెంట్స్ యాప్స్ ను వినియోగిస్తూ ఉంటాము. అయితే ఈ యాప్స్ ద్వారా సులభంగానే ఇతరులకు అమౌంట్ సెండ్ చేయవచ్చు. కానీ ఇంటర్నెట్ తప్పనిసరి. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే ఈ యాప్స్ ద్వారా మనీ సెండ్ చేయలేము. అయితే కేంద్ర టెలికాం సంస్థ గతంలో ప్రవేశ పెట్టిన ఓ విధానం ద్వారా ఇంటర్నెట్ లేకపోయిన ఇతరులకు మని సెండ్ చేయవచ్చు ఆది ఎలాగో చూద్దాం !.

ముందుగా బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా *99 # అనే కోడ్ ఎంటర్ చేయాలి.
అక్కడ మన బ్యాంక్ డిటేల్స్ చూపడంతో పాటు సెండ్ మని, రిక్వస్ట్ మని, బ్యాలెన్స్ ఎంక్వైరీ.. ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనకు కావలసిన ఆప్షన్ ఎంచుకోవాలి.
ఉదాహరణకు మని పంపించాలనుకుంటే సెండ్ మని ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మని ఏ విధంగా పంపించాలి అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. త్రూ మొబైల్ నెంబర్ ద్వారా లేదా యుపిఐ నెంబర్ ద్వారా, లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా..ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. యుపిఐ నెంబర్ కు పంపించాలి అనుకుంటే.. మనం డబ్బు సెండ్ చేయాలనుకుంటున్న యుపిఐ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఆ తరువాత ఆ యుపిఐ ఐడి యుక్క పేరు వివరాలను మనకు చూపిస్తుంది. వాటిని మరోసారి చెక్ చేసిన తరువాత అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ చేయాలి.అంతే ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా చాలా ఈజీగా మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

సీక్రెట్ వెబ్సైట్ ను ఇలా షేర్ చేయండి.. ఎవ్వరికీ తెలియకుండా !

యూపీఐ ద్వారా డబ్బులు వేరే నెంబర్ కు పంపితే.. ఇలా తిరిగి పోడండి !

మీరు వెతికే వెబ్సైట్ డేంజరో కాదో.. ఇలా తెలుసుకోండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -