Saturday, April 27, 2024
- Advertisement -

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే టిప్స్ !

- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. వాటిలో జ్ఞాపకశక్తి లోపం కూడా ఒక్కటి. ముఖ్యంగా విద్యార్థుల్లో చదివింది ఏమాత్రం గుర్తు ఉండకపోవడం, ఎంత చదివిన కొంత సమయానికి మర్చిపోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే జ్ఞాపక శక్తి మందగిండడం అనేది సాధారణ విషయమే అయినప్పటికి అది మరి ఎక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యగా భావించక తప్పదు. అయితే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి మన ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలు అద్భుతంగా ఉపయోగ పడతాయి. అవేంటో ఒకసారి చూద్దాం !

  1. టమోటోలు
    జ్ఞాపక శక్తిని పెంచడంలో టమోటోలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మొదడు కణజాలలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. అందువల్ల టమోటోలను మన రోజువారీ ఆహారంలో తప్పక ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పచ్చి టమోటో తినడం వాళ్ల మెదడు చురుకుదనం పెరుగుతుందని చెబుతున్నారు.
  2. ఓ మెగా 3 ఫుడ్స్
    ఒమేగా 3 ఉన్న ఫుడ్స్ తినడం వాళ్ల మొదడు మరియు నాడీ వ్యవస్థ అత్యంత చురుకుగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒమేగా 3 లో ఉండే ప్యాటి యాసిడ్ జ్ఞాపక శక్తిని పెంచుతూ ఏకాగ్రతను మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. కాబట్టి ఒమేగా 3 పుష్కలంగా దొరికే చేపలను తినాలని సూచిస్తున్నారు నిపుణులు, సల్మాన్ ఫిష్, ట్యూనా ఫిష్ లలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. అలాగే గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజలలో కూడా ఒమేగా 3 ఉంటుదని అందువల్ల మనం తినే ఆహారంలో వీటికి ప్రదాన్యం ఇవ్వాలని చెబుతున్నారు.
  3. గుడ్డు
    గుడ్డు సకల పోషకలకు నిలయం. రోజు ఒక గుడ్డు తినడం వాళ్ల శరీనికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా అందడంతో పాటు, మెదడును చురుకుగా ఉంచడంలో గుడ్డు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, డి, ఇ, బి 12, వంటివి శరీనానికి కావలసిన పోషకాలను అందించడంతో పాటు ఏకాగ్రతను పెంచడంలో కూడా సాయప పడుతుంది. అందువల్లే డాక్టర్లు రోజు ఒక గుడ్డు తినమని సలహా ఇస్తుంటారు.
  4. డార్క్ చాక్లెట్
    చాలా మందికి చాక్లెట్ తినే అలవాటు ఉంటుంది. అయితే చాక్లెట్ తినడం వాళ్ల పళ్ళు పుచ్చిపోతాయని, అందువల్ల చాక్లెట్ తినవద్దని పేరెంట్స్ పిల్లలకు సలహా ఇస్తూంటారు. ఇది వాస్తవమే అయినప్పటికి చాక్లెట్ లో ఎన్నోవిటమిన్స్, ప్రోటీన్స్ దాగి ఉంటాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు చురుకుదనాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. అందుకే రోజుకు ఒక్క బైట్ చొప్పున డార్క్ చాక్లెట్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చిన్న వయసులోనే గుండె పోటు రావడానికి కారణాలు ఏంటో తెలుసా ?

పుడ్ పాయిజన్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

వృద్దాప్యంలో తల్లిదండ్రులను.. ఇలా చూసుకోండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -