Saturday, May 18, 2024
- Advertisement -

ఏపీలో బీజేపీ పగటి కళలేనా..

- Advertisement -
BJP will play a key role in Andhra Pradesh 2019 elections..?

ఉత్త‌రాది రాష్ట్రాల్లో విజ‌యాల్లో దూసుకుపోతున్న బీజేపీ ..ద‌క్షిణాది రాష్ట్రాల‌మీద దృష్టి సారించింది.ప్ర‌ధానంగా ఏపీలో పార్టీనీ బ‌ల‌పేతం చేయాల‌నే దిశ‌గా అడుగులు ముందుకేస్తోంది. అధికార పార్టీ  టీడీపీతో బంధం కొన‌సాగిస్తూనే సొంతంగా క‌మ‌లం పార‌టీ ప్ర‌ణాలిక‌లు ర‌చిస్తోంది.

పైకి  మిత్ర ప‌క్షంతో క‌ల‌సి ఉన్నా స‌మ‌యం వ‌చ్చిన‌పుడు విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూనే ఉంది. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీ స‌మావేశాల్లో బీజేఎల్ పీ లీడ‌ర్ విష్ణుకుమార్ రాజు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పార్టీనీ ఇరుకున పెడుతున్నారు. ఇక ఎమ్ ఎల్ సీ సోము వీర్రాజు అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. స‌మ‌యం దొరికి న‌ప్పుడ‌ల్లా ఒంటికాలి మీద లేస్తున్నారు.2019 ఎన్నిల‌కు ఇక రెండు స‌వ‌త్స‌రాలుఉండ‌టంతో ఇప్ప‌టినుంచే  క్షేత్ర‌స్తాయిలో పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించారు. అయితే ఇప్పటివరకు ఇందుకోసం క్రియాశీల కార్యాచరణను చేపట్టిన దాఖలాలు లేవు. అయితే ఇపుడు బీజేపీ తన వేగం పెంచుతోంది. ఏకంగా కేంద్ర మంత్రులను రంగంలోకి దించేస్తూ తన ప్లాన్ ను ముందుకు తీసుకుపోతోంది.  క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం అవ్వాలో సిద్ధమైంది. అందుకు ఏకంగా ఇటీవల యూపీలో ఘ‌న‌విజ‌యం సాధించిన వ్యూహాన్నేఏపీలో కూడా అనుస‌రించాల‌నీ ప్ర‌ణాలిక‌లు ర‌చిస్తోంది.

శ్రీకాల‌హ‌స్తి ప‌ట్ట‌ణంలో బూత్ స్థాయి క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి ముఖ్య అథిదిగా కేంద్ర చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌మంత్రి క‌ల్ రాజ్ మిశ్రా హాజ‌ర‌య్యారు. క్షేత్ర స్తాయిలో బూత్ క‌మిటీలు ప‌టిష్టంగా ఉండ‌టం వ‌ల్లే  ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో  ఘ‌న‌విజ‌యం సాధించామ‌ని ..అలాగే ఏపీలోకూడా అట్లాంటి క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌తి నియేజ‌క‌వ‌ర్గం ప‌ట్ట‌ణ‌,గ్రామాల్లో బూత్ స్తాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌నీ  పిలుపు నిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈ కమిటీలే కీలక బాధ్యత వహించాయని…. పార్టీనాయ‌కుల‌కు దిశానిర్దేశం చేసి వెళ్లారు.  

ఏపీలో  క‌మ‌లం పార్టీ ప‌రిస్తితి  చూసుకుంటే ఐదుగురు ఎమ్ ఎల్ ఏలు  ఉన్నారు. అదికూడా 2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డంతోపాటు  ప‌వ‌ణ్ క‌ళ్యాన్ మ‌ద్ద‌తుతో  ఆసీట్లు కూడా వ‌చ్చాయ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. క‌నీసం సొంతంగా పోటీ చేసే స్తాయికూడా లేదు. క్షేత్ర‌స్తాయిలో పార్టీ ఎక్క‌డా క‌నిపించ‌దు.క‌నీసం మాస్ పాలోయింగ్ ఉన్న నేత చెప్పుకొనే స్తాయిలో క‌నుచూపుమేర‌లో క‌నిపించ‌రు. పైకి మిత్ర‌ప‌క్షంతో క‌ల‌సి ఉన్నా అది నామ‌మాత్ర‌మే. అవ‌కాశం దొరికి న‌ప్పుడ‌ల్లా మిత్ర‌ప‌క్షం అనే తేడా లేకుండా  విమ‌ర్శిస్త‌లు గుప్పిస్తూనే ఉంటారు. ఏదో కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంద‌ని చెప్పుకోవ‌డం త‌ప్ప చేసిందేమిలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ అత‌ర్వాత చేతులెత్తేసింది. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం చేసిన స‌హాయాన్ని  ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనే స్తితిలో కూడా లేర‌నే చెప్పాలి. 

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను కాద‌ని జాతీయ పార్టీల‌కు ప్రాధాన్య‌త త‌క్కువే. అధికార టీడీపీ ,ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ పార్టీలు బ‌లంగా ఉన్నాయి.ఇప్ప‌టికే ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో బీజేపీ,టీడీపీ రెండు పార్టీలు మోసం చేశాయ‌న్న అంశం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. దీనిపై ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ ,వైఎస్ఆర్ పార్టీ అధినేత జ‌గ‌న్, కాంగ్రెస్‌,వామ‌ప‌క్ష‌పార్టీలు  ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెల్ల‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించామ‌ని చ‌ప్పుకోవ‌డం త‌ప్ప దాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెల్ల‌డంలో బీజేపీ  విప‌ల‌మ‌య్యింది. 2019 ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్షంతోక‌ల‌సి పోటీచేస్తారోలేక ఒంట‌రిగా వెల్తారో వారిలోనే ఒక్లారిటీలేదు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదావిష‌యంలో ప్ర‌జ‌ల‌ను మొసం చేసింద‌ని బీజేపీమీద ప్ర‌తిప‌క్షాలు ఎదురుదాడి మొద‌లు పెట్టారు. 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌ణ్ పార్టీ జ‌న‌సేన ఒంట‌రిగా పోటీచేస్తుంద‌నీ ప్ర‌క‌టించారు.ఎన్నిక‌ల్లో ఎవ‌ర‌కు ఏపార్టీతో క‌ల‌సి పోటీచేస్తారో….ఎవ‌రు ఒంట‌రిగా పోటీచేస్తారో మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.ఇన్ని ప్ర‌తీకూలంశాలు ఉన్న బీజేపీ ఏపీలో పాగా వేయాల‌న్న క‌ల‌లు క‌ల‌లుగానే మిగులుతాయే లేక పాగావేస్తుందో చూడాలి. 

Also Read

  1. తెలంగాణ నాయకులకు ఉన్న ప్రేమ.. మీకు లేదా బాబు
  2. సాక్షి చదవొద్దు అని చెబుతాడు కానీ బాబు మాత్రం చదువుతాడు 
  3. ఎపీ ప్రత్యేక హోదా సాదన కమీటీ నాయకులు ఎక్కడ..?
  4. కేటీఆర్ చేయలేనిది లోకేష్ చేయగలడా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -