Saturday, April 27, 2024
- Advertisement -

ఎపీ ప్రత్యేక హోదా సాదన కమీటీ నాయకులు ఎక్కడ..?

- Advertisement -
Where is Andhra Pradesh special status comments..?

ఏపీకీ ప్ర‌త్య‌క హోదా అనేది ఆక్సీజ‌న్ లాంటిది. దీనిపై ఏపీలో ప్ర‌త్యేక ఉద్య‌మం కూడా కొన‌సాగింది. అయితే ప్ర‌త్యేక ఉద్య‌మాన్ని కొన‌సాగించిన నాయ‌క‌లు ఇప్పుడు ఎక్క‌డున్నారు. ఏపీకీ హోదా  కోసం పోరాడేందుకు ప్ర‌త్యేక‌హోదా  సాధ‌న క‌మిటీనీ ఏర్పాటు చేసి కొన్ని రోజులు హ‌డావుడి చేసి త‌ర్వాత  సైలెంట్ అయ్యారు.

ప్ర‌త్యేక సాధ‌న స‌మితి అధ్య‌క్షుడిగా హీరో శివాజి,గౌర‌వాధ్య‌క్షుడిగా చ‌ల‌సాని శ్రీని వాస్ ఆధ్వ‌ర్యంలో  క‌మిటీనీ ఏర్పాటు చేశారు. హోదాకోసం హీరో శివాజీ  నిర‌హార‌దీక్ష‌కూడా చేశారు. హోదా  సాధ‌న‌కోసం ప్రాణాలైనా అర్పిస్తామ‌న్న నాయ‌కులు ఇప్పుడు ఎక్క‌డున్నారో అర్థం కావ‌టంలేదు. అస‌లే ఉన్నారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

 విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకీ ప్ర‌త్యేక హోదాకు సంబందించిన  అంశాన్ని  బిల్లులో పొందుప‌ర‌చ‌లేదు. పార్ల‌మెంట్ సాక్షిగా రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా  ఐదు సంవ‌త్స‌రాలు ఇస్తామ‌నీ అప్ప‌టి ముఖ్య‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌క‌టించారు. అయితే అదే రాజ్య‌స‌భ‌లో బీజేపీ సీనియ‌ర్ నేత వెంక‌య్య‌నాయుడు ఐదు సంవ‌త్స‌రాలు కాదు ప‌దిసంవ‌త్స‌రాలు ఇవ్వాల‌నీ డిమాండ్ చేశారు. బీజేపీ  కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే ప‌ది స‌వ‌త్స‌రాలు ప్ర‌త్యోక హోదా ఇస్తామ‌నీ ప్ర‌క‌టించారు. విభ‌జ‌న  పూర్త‌య్యి రెండు రాష్ట్రాలుగా ఏర్ప‌డిన త‌ర్వాత ప్ర‌త్యోకహోదా పై బీజేపీ యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ఒక్క‌సారిగా ఏపీలో ప్ర‌తిప‌క్షాలు  అధికార బీజేపీ మీద విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఎట్టి ప‌రిస్తితుల్లోనూ ఏపీకీ ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప్ర‌స‌క్తేలేద‌నీ….దానితో స‌మాన‌మైన  ప్ర‌త్యేక ప్యాకేజీనీ ప్ర‌క‌టించింది.

 

ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ మిన‌హా మిగిలిన  రాజ‌కీయ  పార్టీల‌న్నీ  హ‌డావుడీ చేసి త‌ర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక హీరో శివాజీ, చ‌ల‌సాని శ్రీనివాస్ లు ఒక అడుగు ముందుకేసి ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీని ఏర్పాటు చేసి హ‌డావుడీ చేశారు. వీరికి తోడు వామ‌ప‌క్ష‌పార్టీలుకూడా క‌ల‌సి పోరాటం చేశాయి. హోదా  కోసం సంత‌కాల సేక‌ర‌ణ‌, నిర‌హారాదీక్ష‌, ఉద్య‌మాలు చేసిన నాయ‌కులు ఇప్పుడ ఎక్క‌డున్నార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. అప్పుడ‌ప్పుడు మీడియాలో తూతూమంత్రంగా క‌నిపించ‌డం త‌ప్ప ఎక్క‌డా వీరి ప్ర‌స్తావ‌న క‌నిపించ‌డంలేదు. ఉద్య‌మాన్ని తాక‌ట్టు పెట్టారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

Also Read

  1. బాబుకు కేంద్ర ఝుల‌క్‌….పోల‌వ‌రం అంచ‌నాలు పెరిగితే రాష్ట్ర‌మే భ‌రించాల‌న్న కేంద్రం
  2. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌ద‌రంగంలో అఖిల ప్రియ పావేనా?
  3. ఇర‌కాటంలో జ‌న‌సేన‌…. పవన్ చూపుఎటూ
  4. కొత్త‌ ఇళ్లు అదిరంద‌య్య చంద్రం…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -