Monday, May 13, 2024
- Advertisement -

ఎన్టీఆర్, బాలయ్య, మహేష్‌లతో చంద్రబాబు రాజకీయం… నందుల సీక్రెట్ ఇదే

- Advertisement -

నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, తర, తమ భేదాలు లేకుండా పరిపాలన అందిస్తానని బోలెడన్ని ప్రమాణ స్వీకారోత్సవాలు చేస్తారు పాలకులు. కానీ వాళ్ళ ప్రతి అడుగు, మాట అంతా కూడా రాజకీయమే…వ్యక్తిగత స్వార్థమే. ఇలాంటి పొలిటికల్ మేనేజ్‌మెంట్‌ల విషయంలో చంద్రబాబు నాయుడు కింగ్ అని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో మేధావులు చెప్పారు. న్యాయవ్వవస్థతో సహా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలడు. అలాగే ప్రజల్లో సెంటిమెంట్స్‌ని రగిలించడంలో కూడా దిట్ట. ఎల్లో మీడియా మొత్తం కూడా ఇలాంటి విషయాల్లో చంద్రాబాబుకు మామూలుగా జాకీలు వేయదు. ఐదు కోట్ల విలువ చేసే ఫైవ్ స్టార్ హోటల్ లాంటి బస్సులో బాబు నిద్రిస్తే ఏదో డొక్కు ఎర్ర బస్సులో పడుకున్నాడు అన్న కలర్ ఇవ్వగలరు. ఇక మనవడితో ఆడుకోలేకపోతున్నాడు అంటూ చంద్రబాబు, లోకేష్, పచ్చ మీడియాలు చేసిన ప్రచారం గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. వెన్నుపోటు దెబ్బకు పదవి కోల్పోయిన దిగులుతో ఎన్టీఆర్ చనిపోతే …..వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించేసిన చంద్రబాబే ఆ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు కొల్లగొడుతున్నాడంటేనే చంద్రబాాబు, ఎల్లో మీడియాల మేనేజ్‌మెంట్ స్థాయి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

తన వ్యక్తిగత జీవితాన్ని, ఇంకా ప్రపంచం చూడని మనవడిని కూడా రాజకీయ స్వార్థం ఉపయోగించుకునే చంద్రబాబు ఇక సినిమా నందులను మాత్రం వదులుతాడా? అందుకే నందులకు కూడా తన రాజకీయ స్వార్థపు రంగును పూసేశాడు చంద్రబాబు. ఆ రంగు కాస్తా ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేస్తోంది. తండ్రి ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ నంది అవార్డుల విషయంలో జోక్యం చేసుకోలేదు బాలయ్య. అందుకే తన సూపర్ హిట్ క్లాసిక్స్‌కి కూడా నంది అందుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం బాలయ్యను అడ్డుపెట్టుకుని తన రాజకీయ స్వార్థానికి నందుల పంపకం చేసేశాడు. తీవ్రస్థాయిలో వస్తున్న విమర్శలన్నీ బాలయ్య చుట్టూ తిరిగేలా చేసి తన చేతికి మట్టి అంటకుండా చేసుకున్నాడు. బాలకృష్ణ నియోజకవర్గంలో ప్రజల వ్యతిరేకతను కూడా రాష్ట్రవ్యాప్తంగానూ, నేషనల్ మీడియాలో కూడా పాపులర్ అయ్యేలా చేసి రాజకీయంగా బాలకృష్ణకు ఎదిగే అవకాశం లేకుండా చేస్తూ జాగ్రత్త పడుతున్న నాయకుడు చంద్రబాబు.

ఇక 2018 జనవరిలో నందుల పండుగ తర్వాత కేవలం ఏడాది వ్యవధిలోనే ఎన్నికలు వస్తాయన్న విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే 2009లో తన ప్రచార సునామీతో చంద్రబాబును కూడా భయపెట్టిన ఎన్టీఆర్‌ని మరోసారి దగ్గరకు తీయాలనుకుంటున్నాడు చంద్రబాబు. తారక్ సామర్థ్యం ముందు లోకేష్ నిలబడలేడన్న కారణంతో ఏళ్ళపాటు ఎన్టీఆర్‌ని పార్టీకి దూరం చేసిన బాబు ఇప్పుడు 2019 ఎన్నికల సమయానికి దగ్గర తీయాలని చూస్తున్నాడు. పార్టీ జనరల్ సెక్రటరీగా, మంత్రిగా లోకేష్ స్థిరపడ్డాడని….ఇఫ్పుడు ఎన్టీఆర్ టిడిపిలోకి వచ్చినా లోకేషే సీనియర్‌గా ఉంటాడన్న నమ్మకంతోనే బాబు ఎన్టీఆర్‌ని చేరదీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్‌కి బాలయ్యకు మధ్య ఉన్న విభేదాలను కూడా పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ విషయంలో నారా లోకేష్ కూడా ఎన్టీఆర్‌కి ఆఫర్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌కి 2018 జనవరిలో జరగబోయే నందుల పండుగతోనే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు చంద్రబాబు. ఆ వేదికపై నుంచే ఎన్టీఆర్-బాలయ్యలను కలపడంతో పాటు నందమూరి అభిమానులు మొత్తం కూడా టిడిపికి సేవ చేసేలా చేయాలనుకుంటున్నాడు. అలాగే మహేష్ బాబును కూడా టిడిపిలో భాగం చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు.

ఆ రకంగా నందమూరి వారితో పాటు కమ్మవారిని కూడా పూర్తిగా శాటిస్‌ఫై చేసి విజయవాడ వేదికగా నందమూరి అభిమానులకు, తన వర్గం వారికి 2019లో టిడిపిని గెలిపించాలన్న టార్గెట్ ఫిక్స్ చేయనున్నాడు చంద్రబాబు. వైఎస్ జగన్‌తో సన్నిహితంగా ఉంటున్న నాగార్జున టిడిపికి అనుకూలంగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టే మనం లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేలా చేశాడు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయ తంత్రాలకు బాలయ్య, మహేష్, ఎన్టీఆర్‌లు బుట్టలో పడతారో లేదో చూడాలి మరి. వీళ్ళ అందరిలోనూ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి చంద్రబాబును నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడా? తాతలాగే ఎన్టీఆర్ కూడా చంద్రబాబు రాజకీయ వ్యూహంలో చిక్కుతాడా? 2018 నందుల వేదికగా చంద్రబాబు రాజకీయం తాలూకూ మరిన్ని పన్నాగాలు తెలియాలంటే మరికాస్త కాలం వెయిట్ చెయ్యాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -