Thursday, May 9, 2024
- Advertisement -

శభాష్ ఈనాడు…. వైఎస్సార్‌ని సీన్‌లోకి భలేలాగారు…. పాపం ఆయనదే అని కూడా చెప్పండి

- Advertisement -

సిఎం నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన బోటు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. అక్రమంగా తీరుగుతున్న బోటు, అర్హత లేని డ్రైవర్ ప్రమాదానికి కారణం అయ్యారు. ప్రమాదం జరిగిన 40 నిమిషాల తర్వాత కానీ అధికార యంత్రాంగం ప్రమాద స్థలికి చేరుకోలేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళ ముందు జరిగిన ఈ విషయాలన్నీ పరిశీలించిన ఎవరికైనా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అక్రమార్కులపై ఉక్కుపాదం అని చెప్పి మూడేళ్ళుగా రంకెలేస్తున్నాడు చంద్రబాబు.

పచ్చ మీడియా మొత్తం కూడా బాబు ఉక్కుపాదం గురించి, అక్రమార్కుల అణచివేత గురించి పేజీలకు పేజీలు కథలు కథలుగా రాసేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ మొత్తం ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాలకే చోటులేకుండా బాబు చేస్తున్నాడని కహానీలు చెప్పారు. తీరా చంద్రబాబు నివాసం పక్కనే అక్రమ బోటు వ్యవహారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. సిఎంవోకు కూడా దందాలో భాగం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మంత్రులు ఈ దందా నడిపిస్తున్నారని పేర్లు ప్రస్తావించకుండా పచ్చమీడియానే చాలా తెలివిగా ప్రస్తావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే పాలన పరంగా చంద్రబాబు వైఫల్యం ఏ స్థాయిదో ఇట్టే తెలిసిపోతుంది.

ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం ఇప్పుడు పచ్చ మీడియా మొత్తం కూడా పడరాని పాట్లు పడుతోంది. బాధితుల ఆర్తనాదాలు వినిపించుకోవడం లేదు. కనీసం నష్టపరిహారం కాస్త ఎక్కువ వచ్చేలా, గాయపడ్డవారికి ట్రీట్‌మెంట్ బాగుండేలా చేయాలన్న ఆలోచన అస్సలు లేదు. ప్రమాదం జరిగిన మరుక్షణం నుంచీ బాబును కాపాడడమే పచ్చ మీడియా పని అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా వైఎస్‌లకు ఆపాదించాలని ప్రయత్నించే పచ్చ మీడియా, బాబు బ్యాచ్ అందరూ కూడా ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం మొదలెట్టారు. 2007లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణాలో జరిగిన ప్రమాదాన్ని ఇప్పుడు ఈనాడు మీడియా హైలైట్ చేస్తూ వార్తలు రాసింది. ఇక ఈ రోజంతా కూడా ఈనాడు వార్తలను అందిపుచ్చుకుని ఆంధ్రజ్యోతి, ఎన్టీఆర్ భవన్ పెెయిడ్ జర్నలిస్టులందరూ వైఎస్‌లపైన విమర్శల వర్షం కురిపిస్తారనడంలో సందేహం లేదు. ఆ రకంగా వైఎస్‌లు అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అని ప్రజలకు చెప్తారన్నమాట.

మొదటి నుంచీ చంద్రబాబు, ఆయన భజన మీడియాది ఇదే స్టైల్. స్టాంపుల కుంభకోణం నుంచీ ఎన్నో కుంభకోణాల్లో టిడిపి నాయకులు అడ్డంగా దొరికిపోయారు. బ్రీఫింగ్ ఇస్తూ ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏ స్థాయిలో ఇరుక్కున్నాడో చెప్పనవసరం లేదు. ఇక బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టిన సుజనా బాగోతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ ఒన్‌గా నిలిచిందన్న తాజా సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత కూడా బాబు అండ్ కో సిగ్గుపడరు. అన్నింటికీ ఒకటే బూచీని చూపిస్తారు. చంద్రబాబు అవినీతి పరుడు, పాలన చేతకాదు, వెన్నుపోటుదారుడు……ఇలా ఎన్ని విమర్శలు ఉంటేనేం…..వైఎస్‌లు అంతకంటే పెద్ద అవినీతిపరులు అని ప్రజలను నమ్మించడానికి పచ్చ మీడియా ఎప్పుడు రెడీగా ఉంటుందిగా. ససాక్ష్యంగా ఇప్పటి వరకూ ఒక్క కేసులో కూడా వైఎస్‌ల అవినీతి బయటపడింది లేదు. అయినప్పటికీ వైఎస్‌లపైన విషం కక్కుతూనే ఉంటారు. వైఎస్‌ల కంటే బాబు మంచోడు……బాబుకు ఓటెయ్యండి అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కృష్ణా ప్రమాదం విషయంలో కూడా అదే స్ట్రాటజీకి తెరలేపింది ఈనాడు. మీడియా మొఘల్ అని పిలిపించుకునే యాజమాన్యం చేతిలో ఉన్న నంబర్ ఒన్ పత్రికే ఇలా ఉంటే ఇక చిన్న చిన్న పచ్చ మీడియా సంస్థలకు అడ్డూ ఆపూ ఉంటుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -