అసలు ఈ మాహిష్మతి రాజ్యం ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటి..?

Everything you should know about the real Mahishmati Kingdom

“మాహిష్మతి .. సామ్రాజ్యం .. ఆస్మాకం .. అజేయం” అనే పాట బాహుబలి రిలీజ్ అయ్యినప్పటి నుండి పాడుకుంటున్నాం.. మనవరకు అయితే ఈ మాహిష్మతి అనే సామ్రాజ్యం పేరు వినడం అప్పుడే మొదటిసారి. అయితే బాహుబలి సినిమా చూసాక మాహిష్మతి నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాం. రాజమౌళి ఊహాశక్తిని చూసి వందల కోట్లు బహుమానంగా ఇచ్చేసాం.

కాని ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాహిష్మతి అనే పేరుతొ నిజంగానే ఏదైనా రాజ్యం ఉందో లేదో ? మాహిష్మతి అనే పేరుతో నిజంగానే రాజ్యం ఉండేది. అది కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే. అయితే ఆ రాజ్యం వేరు.. రాజమౌళి మహిష్మతి వేరు. రాజ్యం పేరు మాత్రమే వాడుకున్నారు. భావన నిర్మాణాలు, యుద్దరీతులు .. అన్ని రాజమౌళి సృష్టించినవే. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో సృష్టించిన మాహిష్మతికి, అసలైన మాహిష్మతికి చాలా తేడాలున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.

{loadmodule mod_custom,Side Ad 1}

అసలైన మాహిష్మతి రాజ్యం గురించి ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం.. రామాయణంలో మాహిష్మతి వివరాలున్నాయి తెలుసా ? ఇక్ష్వాకు కొడుకు దశాశ్వ మాహిష్మతిని పరిపాలిస్తున్నప్ప్పుడు రావణుడు మాహిష్మతిపై దాడికి దిగాడట. పద్మపురాణంలో కూడా మాహిష్మతి గురించి సమాచారం ఉంటుంది. దీనిని నిర్మించిన రాజు పేరు మాహిష అని కొన్న్ని గ్రంధాలలో ఉంటే, ఆ రాజు పేరు మాహిష్మాంత్ అని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. ఇద్దరు ఒకరేనా కాదా అనే విషయం తెలియదు. కాని ఎవరు నిర్మించినా, ఆ రాజు పేరు మీదే దీనికి మాహిష్మతి అనే పేరు వచ్చింది అని తెలుస్తోంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  2. బాహుబలి 2 చూసి.. తెగ ఏడ్చేసిన రమ్యకృష్ణ..
  3. బాహుబలికి ఈ పాపకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..?
  4. ఘోరం : చిరు, పవన్ ఫ్యాన్స్.. బాహుబలి 2 కి చూడొద్దంటూ.. ప్రచారం