Monday, May 13, 2024
- Advertisement -

బాబు, లోకేష్‌లకు బిగ్గెస్ట్ షాక్ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్

- Advertisement -

బోటు ప్రమాదంలో 22 మంది చనిపోయిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి నంది అవార్డ్స్ ఇష్యూని ఉపయోగించుకోవాలనుకున్నాడు చంద్రబాబు. అందుకే ఆ ప్రమాదం జరిగిన వెంటనే…రెండు రోజుల వ్యవధిలో ఎప్పుడో ఆరు నెలల క్రితం ఫైనల్ అయిన నంది అవార్డ్స్‌ని ప్రకటింపచేశాడు. చంద్రబాబు అనుకున్నట్టుగానే పడవ ప్రమాదం ఇష్యూని సైలెంట్ చేయడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయింది. అయితే బాబు అండ్ టీం ఊహించని విధంగా నంది అవార్డ్స్ వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. మామూలుగా సినిమా వాళ్ళకు మౌనంగా ఉండడం బాగా అలవాటు. అది కూడా టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవ్వరూ చేయరు. అయితే 2014 తర్వాత నుంచి బాబు అండ్ కో వ్యవహారాలతో సినిమా జనాలు కూడా విసిగిపోయి ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడంతో పాటు, ప్రత్యేక హోదా లాంటి విషయాలపై పోరాటం చేయడానికి ముందుకు వచ్చిన సినిమా జనాలను అరెస్ట్ చేయించడం లాంటివి చాలానే చేశాడు చంద్రబాబు. ఇప్పుడు నంది అవార్డ్స్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం…. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవార్డ్స్ ఇవ్వడాన్నే ఆపేస్తాం లాంటి మాటలు మాట్లాడడంతో సినిమా జనాల ఆవేశం పతాక స్థాయికి చేరింది. ఇక నారా లోకేష్ బాబు తన ఆధార్ కార్డ్ మాటలతో అగ్నికి ఆజ్యం పోశాడు. అమెరికాలో చదువుకున్నాడు, గొప్ప మేధావి, చిన్నప్పుడే ప్రధాని పదవి చేపట్టొద్దని తనకు గొప్పగా నీీీతి బోధ చేసిన ప్రతిభ లోకేష్ సొంతం అని లోకేష్‌ని గొప్పగా చూపించడానికి బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎల్లో మీడియా మొత్తం కూడా లోకేష్‌ని ప్రపంచంలోనే గొప్ప యువనాయకుడిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నా లోకేష్ మాత్రం తను మాట్లాడే ప్రతి మాటతోనూ కామెడీ అయిపోతున్నాడు. నంది అవార్డ్స్ వివాదంలోకి అనవసరంగా ఎంటర్ అయిన లోకేష్ ఆధార్ కార్డ్, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ తెలంగాణా ఉద్యమ సమయంలో కెసీఆర్ ఆంధ్రులను అవమానించిన స్థాయిలోనే లోకేష్ కూడా మాట్లాడడం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. నిజాయితీగా తనకు తోచింది మాట్లాడే పోసాని కృష్ణమురళి అయితే లోకేష్ మాటలను చీల్చి చెండాడేశాడు. అధికార మదంతో లోకేేష్ మాట్లాడతున్నాడని ఓ స్థాయిలో విరుచుకుపడ్డాడు పోసాని. పోసాని మాటలకు నారా లోకేష్ వైపు నుంచి ఏ స్పందనా రాదని ఇట్టే చెప్పెయ్యొచ్చు. నిజానికి పోసాని తిట్టిన తిట్ల విషయం పక్కనపెడితే ఆయన మాట్లాడిన మాటలు మాత్రం న్యాయంగానే ఉన్నాయని టిడిపికి అనుకూలంగా ఉండే సినిమా జనాలు కూడా అంగీకరిస్తున్నారు. పోసాని, గుణశేఖర్, అల్లు అరవింద్ క్యాంప్‌ల నుంచి తగిలిన షాక్‌ల కంటే నందమూరి క్యాంప్ నుంచి …అది కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అండ్ కోకు బిగ్గెస్ట్ షాక్ తగలనుందని తెలుస్తోంది.

2009లో ఎన్టీఆర్‌ని ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. వైఎస్, చిరంజీవి, చంద్రబాబులతో సహా ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులందరికంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఖాకీ డ్రెస్‌లో నాటి నందమూరి తారక రామారావు ప్రసంగాలను గుర్తు చేశాడు. తెలుగు ప్రజలు కూడా ఎన్టీఆర్‌కి బ్రహ్మరథం పట్టారు. అదే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించింది. ఆ వెంటనే చాలా ప్లాన్డ్‌గా టిడిపికి దూరం చేశారు. పైగా ఎన్నో నిందలు కూడా వేశారు. తన ప్రాణాలకు తెగించి వైఎస్‌లాంటి అత్యంత శక్తివంతుడైన నాయకుడికి వ్యతిరేకంగా, తనకంటే ఎన్నో ఏళ్ళు ఎక్కువ అనుభవమున్న… అప్పటికి ఇండస్ట్రీలో నంబర్ ఒన్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవితో కూడా తలపడి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం అహర్నిశలూ కష్టపడిన ఎన్టీఆర్‌కి చంద్రబాబు ఇచ్చిన బహుమతి అది. తన పదవి కోసం స్వర్గీయ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన కొడుకు రాజకీయ భవిష్యత్‌‌కి పోటీ అవుతాడన్న ఉద్ధ్యేశ్యంతో జూనియర్ ఎన్టీఆర్‌కి అన్యాయం చేశాడు. టిడిపికి దూరం చేసిన తర్వాత కూడా ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఆలోచనా తీరు మారిపోయింది. పార్టీ పరంగానూ, ప్రభుత్వ పదవుల పరంగానూ ఇప్పుడు ఎన్టీఆర్ కంటే నారా లోకేష్ సీనియర్ అయిపోయాడు. తన కొడుక్కు మంత్రి పదవి కట్టబెట్టి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. అయితే లోకేష్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినా సరే ప్రజా సమూహాన్ని కదిలించగల శక్తి, ప్రజలను ఓట్లేసేలా చేయగల సామర్థ్యం లోకేష్‌కి లేదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే లోకేష్‌కి చేదోడు వాదోడుగా ఉండేలా జూనియర్ ఎన్టీఆర్‌ని దగ్గర చేసుకోవాలని చూస్తున్నాడు చంద్రబాబు. ఆ మధ్య నారా లోకేష్ కూడా ఎన్టీఆర్‌తో చర్చలు జరిపాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా ఇంకో ఇరవై ఏళ్ళ వరకూ రాజకీయాల ప్రసక్తే లేదని చెప్పాడు. అయితే 2019 ఎన్నికల నాటికి పరిస్థితలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. బిజెపితో దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తాడేమోనన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఇప్పుడు నందమూరి తారక రామారావు ఇమేజ్ కోసం తారక్‌ని చేరదీసే ప్రయత్నాల్లో ఉన్నాడు చంద్రబాబు. నంది అవార్డ్స్ వేడుకలో ఎన్టీఆర్ చేత తన పాలనను పొగిడించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్. ఎన్టీఆర్‌తో పాటు నందమూరి వారసులందరూ తనతోనే ఉన్నారు అని చెప్పుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబుది.

అయితే చంద్రబాబుకి ఇప్పుడు ఈ విషయంలో సూపర్ షాక్ ఇవ్వనున్నాడట ఎన్టీఆర్. నంది అవార్డ్ వచ్చిన వెంటనే అభినందనలు తెలపడానికి నారా లోకేష్ అండ్ టీం నుంచి స్పందన వస్తే ఎన్టీఆర్ లైట్ తీసుకున్నాడట. అలాగే నంది అవార్డ్స్ కార్యక్రమానికి హాజరవకూడదన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్ ఉన్నాడని తారక్ సన్నిహితులు చెప్తున్నారు. అదే జరిగితే మాత్రం చంద్రబాబు పరువు పోవడం ఖాయం. అలాగే నందమూరి అభిమానుల్లో కూడా పూర్తి వ్యతిరేక సంకేతాలు వెళతాయి. అందుకే ఎలాగైనా ఎన్టీఆర్‌ని నంది అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్న ప్రయత్నాల్లో బాబు, లోకేష్‌లు ఉన్నారట. ఒకసారి చంద్రబాబుని నమ్మి నిండా మునిగిన ఎన్టీఆర్ మరోసారి అలాంటి అవకాశం ఇస్తాడా? లేక తాను నిర్ణయించుకున్నట్టుగానే ఇంకో పది పదిహేనేళ్ళ వరకూ సిిినిమాలు చేసుకుని ఆ తర్వాత పరిస్థితులను బట్టి రాజకీయ రంగంలో కూడా సత్తా చూపే ప్రయత్నాలు చేస్తాడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -