- Advertisement -

హతవిధీ… బాబు ఆవేదన… అసలు కారణం ఇదా?

- Advertisement -

2014 ఎన్నికల సమయంలో ప్రపంచంలోనే తనంత పోటుగాడు లేడు అనే స్థాయిలో మాటలు చెప్పి….. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ చేత భజన చేయించుకుని…. మోడీ ఇమేజ్ పుణ్యమాని…. నెలల కాలం పాటు పచ్చ జనాలు, పచ్చ మీడియా మొత్తం కూడా బాబు అంతటి తోపులేడు అని ప్రచారంతో హోరెత్తించడంతో బొటా బొటీ మెజారిటీతో అధికారంలో రాగలిగాడు చంద్రబాబు. కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అన్నీ ఏడుపుల వార్తలే వినిపించాడు. కొన్నాళ్ళపాటు అఫిడవిట్స్ అంటూ కాంగ్రెస్ చేసిన అన్యాయం అంటూ ఆవేదనా పూరిత నట విన్యాసంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కథలు వినిపించాడు. ఆ తర్వాత బస్సులో పడుకుని పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తీరా చూస్తే ఆ బస్సు ఐదున్నర కోట్లు ఖర్చుపెట్టి కొన్న ఫైవ్ స్టార్ స్థాయి సౌకర్యాలున్నదని తెలిసేసరికి ఎపి ప్రజలు నోరెళ్ళబెట్టారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు తాతా-మనవడి కథలు వినిపించారు. ఇప్పుడిక ఎన్నికల ఏడాది వచ్చేసరికి ఆవేదనాభరిత నట విన్యాసంతో రకరకాల కథలు వినిపిస్తున్నాడు చంద్రబాబు. పచ్చ మీడియాకు, పచ్చ జనాలకు ఆ కథలు బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి కానీ సామాన్య ప్రజలకు మాత్రం మరో రకమైన నిజాలు తెలుస్తూ ఉన్నాయి.

ప్రజా సంకల్పయాత్ర పుణ్యమాని రోజు రోజుకూ జగన్ గ్రాఫ్ పెరుగిపోతోందని సొంత ఇంటెలిజెన్స్ వర్గాలే బాబును హెచ్చరిస్తున్నాయి. ఈ సారి ఎలాంటి మేజిక్కులు కూడా పనిచేయవని, ప్రజాబలం జగన్‌కి తారా స్థాయిలో పెరుగుతోందన్నది వాటి సారాంశం. జగన్ బలం విషయం పక్కన పెడితే నారా లోకేష్‌తో కూడా బాబుకు నానా తంటాలు వచ్చిపడుతున్నాయంట. త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని రీసెంట్‌గా తన అమెరికా మిత్రులకు సందేశాలు పంపాడట లోకేష్. మరోవైపు అప్రూవర్‌గా మారిపోయిన మత్తయ్య దెబ్బకు చంద్రబాబు అడ్డంగా ఇరుక్కోవడం ఖాయమని సుప్రీం కోర్టు న్యాయనిపుణులు తేల్చిచెప్తున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా తాజాగా బాబు ఎంపిక చేసిన వ్యక్తి కూడా ఈ సారి పరిస్థితులు సంక్లిష్టంగానే ఉన్నాయని చెప్తున్నాడట. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హై కోర్టు నోటీసులు ఇవ్వడం కూడా బాబుకు కొత్త కష్టాలు వచ్చేలా చేస్తోందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తెరముందు ఎన్ని పోరాట నాటకాలు నడిపిస్తున్నా తెరవెనుక మాత్రం మోడీ ప్రాపకం కోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే చివరి వరకూ ప్రయత్నం చేసిన బాబు సన్నిహితుడు, ఢిల్లీ పెద్దమనిషి ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశాడట. చంద్రబాబును ఇప్పుడు మోడీనే కాదు ఢిల్లీ స్థాయి నాయకులు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదని తేల్చేశాడట. ఇక సత్తా ఉన్న మేధావి అని పచ్చ మీడియా ప్రొజెక్ట్ చేసిన నాయకుడు కూడా తన వంతు ప్రయత్నం చేసి చేతులెత్తేశాడట. చంద్రబాబుపై ఉన్న 19 స్టేలలో ఏ ఒక్క స్టే ఎత్తి వేసినా కూడా బాబుకు కష్టకాలం దాపురించినట్టే. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే లోకేష్ కూడా ముఖ్యమంత్రి అవుతా అని సన్నిహితులకు చెప్తున్నాడా అని సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలోనే చంద్రబాబులో ఆవేదన కట్టలు తెంచుకుంటోందని ఢిల్లీలో ఉన్న రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఏదో చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్ళ కాలం కూడా ఏమీ చేయలేకపోయాను, అందరూ నన్ను కష్టాలు పెడుతున్నారు అని చెప్పుకుంటూ కాలం గడిపేయడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ఆవేదనాభరిత నట విన్యాసాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఓట్లేస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -