Thursday, May 16, 2024
- Advertisement -

ఈ కుట్ర రాజకీయాలు ఎక్కడ నేర్చావ్ పవన్? ప్రజలను మోసం చేయడానికే వచ్చావా?

- Advertisement -

రాజకీయాలను మార్చేస్తాను… జంపర్స్, జోకర్స్‌కి నా పార్టీలో స్థానం ఉండదు, అవినీతికి చోటే లేదు అని నాలుగు పంచ్ డైలాగులతో పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్. కానీ జనసేన పుట్టుకలోనే ఓ మోసం ఉంది. సీమాంధ్రప్రజలందరూ ఆవేదన చెందుతున్నప్పుడు పవన్ ఎంచక్కా ఫాంహౌస్‌లో..షూటింగ్‌లలో ఉన్నాడు. సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష అన్న జగన్‌పై సీమాంధ్రప్రజలకు అనుమానాలు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయిన పచ్చ మీడియా, చంద్రబాబులు ఎంచక్కా తెలంగాణా ఏర్పాటుకు పూర్తిగా సహకరించారు. ఆటైంలో కూడా పవన్ కళ్యాణ్ సీమాంధ్రుల ఆవేదన పట్టించుకున్నది లేదు. రాష్ట్రం విడిపోయాక మాత్రం రీ ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులతో జనసేన లాంఛింగ్ సినిమాను ఫైవ్ స్టార్ హోటల్‌లో రక్తి కట్టించాడు. తెలంగాణా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబుకు ఓట్లేయమన్నాడు. విభజన మీరు చేస్తారా? చేయరా? చేయకపోతే మేం అధికారంలోకి వచ్చాక చేస్తాం అని కాంగ్రెస్‌ని దోషిగా చూపించే ప్రయత్నం చేసి…. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ని నడిపించి పార్లమెంట్‌లో కూడా విభజన బిల్లుకు పూర్తిగా సహకరించిన బిజెపిని కూడా గెలిపించమని సీమాంధ్రప్రజలకు చెప్పాడు. వాళ్ళ హామీలకు తాను బాధ్యత వహిస్తాను. హామీలు నెరవేర్చకపోతే నేను ప్రశ్నిస్తానన్నాడు.

టిడిపి, బిజెపిలు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చింది లేదు. రెండున్నరేళ్ళ పాటు తన సినిమా షూటింగ్‌లు, ఫాం హౌస్ వ్యవహారాలతో బిజీగా ఉన్న పవన్ ఆ తర్వాత హోదా కోసం ఏదో నాలుగు రోజుల షో చేశాడు. ఆరునెలలకోసారి ప్రజల ముందు కొచ్చాడు. తన సినిమాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి చాలా పనులే చేయించుకున్నాడు.

ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతుండే సరికి పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల కోసం జేఏసీని స్థాపిస్తున్నానన్నాడు పవన్. పోరాటం చేస్తాడేమో అని ఆలోచించినంత సేపు పట్టలేదు…….అది పోరాటం చేసే జేఏసీ కాదు….అధ్యయనం చేసే జేఎఫ్‌సి అని పేరు మార్చానని పవన్ చెప్పడానికి. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయంపై అధ్యయనం చేస్తారట రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయాలపై పవన్ కొత్తగా అధ్యయనం చేస్తానడడం కంటే దారుణమైన మోసం ఇంకేమైనా ఉంటుందా? అధ్యయనం చేసి ఏం చేస్తావు పవన్ అని ప్రశ్నిస్తే పవన్ సమాధానాలు మరీ ఘోరంగా ఉన్నాయి. నాకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడు, నేనేం చేయలేను అని కూడా పవనే చెప్పాడు. మరెందుకు ఈ డ్రామా?

ఎందుకంటే ఎసిలో సుఖంగా ఉంటూ నమ్మి ఓట్లేసిన తమను గాలికొదిలేశాడని ప్రజలు అనుకోకుండా……అధ్యయనం, కమిటీలాంటి పెద్ద పెద్ద పదాలు వాడి జనాలను మభ్య పెట్టడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. ఇప్పుడు అదే ట్రిక్ పవన్ ఫాలో అవుతున్నాడు. ఇంకో ఏడాది అధ్యయనం చేస్తాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ఎన్నికల గోదాలోకి దిగుతాడు. అంతకుమించి పవన్ డ్రామా కొత్తగా ఏమైనా ఉంటుందా? పోరాటం అంటే అధికారంలో ఉన్న చంద్రబాబుకు, మోడీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలి. మరీ ముఖ్యంగా చంద్రబాబు జేబులో బొమ్మ అయిన పవన్ కళ్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఫైట్ చేస్తాడు? అఫ్కోర్స్…..ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో వెనకడుగేస్తున్నాడు కానీ పవన్‌కి మాత్రం ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేత జగన్‌పైన, ఎప్పుడో చనిపోయిన వైఎస్‌పై పోరాటం చేయాలన్న ఉబలాటం, విమర్శలు చేయాలన్న ఆరాటం ఎక్కువే. కానీ బాబుపై మాత్రం పోరాటం చేయలేడు. అంతా కుమ్మక్కు, ప్యాకేజ్ రాజకీయాల మహత్యం. అందుకే ఈ అధ్యయనం డ్రామా. ఇంతోటిదానికి పచ్చ మీడియా అంతా కూడా ఆహా పవన్….ఓహో పవన్ అంటూ కీర్తనలు పాడడం…….ఈ డ్రామాలతోనే కదా స్వామి రాష్ట్ర విభజన నాడు, 2014 నుంచీ ఇప్పటి వరకూ కూడా సీమాంధ్ర ప్రజలను దగా చేస్తున్నది. మరీ ఇంత మోసమా? ఇదేనా పవన్ రాజకీయాలను మార్చడమంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -