Saturday, May 11, 2024
- Advertisement -

సాటి మనిషికి సాయం….. ఇదయ్యా చంద్రబాబుకు జగన్‌కి వ్యత్యాసం

- Advertisement -

లక్ష రూపాయలు సాయం చేసి కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేయించుకుంటున్న వాళ్ళను చూస్తూనే ఉన్నాం. ఇక చంద్రబాబు గురించి అయితే చెప్పనవసరం లేదు. పైసా సాయం చేసి వంద కోట్ల సాయం చేశానని చెప్పుకుంటాడు. లేని గొప్పలన్నీ డప్పా కొట్టుకుంటూ ఉంటాడు. ఆ ప్రచార గొప్పలు, అబద్ధాలు పక్కనపెడితే చంద్రబాబు ఏంటి అంటే పచ్చ బ్యాచ్ కూడా ఏమీ చెప్పలేరు. అలాగే సాయం చేయమని దగ్గరకు వచ్చిన సామాన్యులను చంద్రబాబు అయినా లోకేష్ అయినా ఏ స్థాయిలో తిట్లు తిడతారో చూస్తూనే ఉన్నాం.

అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి కానీ, జగన్ కానీ సాయం చేయమని దగ్గరకు వచ్చిన సామాన్యులతో దురుసుగా ప్రవర్తించినట్టు, మాట్లాడినట్టు ఎప్పుడూ కనిపించదు. వైఎస్‌ల మానవత్వం గురించి, సాయం చేసే నైజం గురించి కూడా వాళ్ళిద్దరినీ దగ్గరగా చూస్తున్న జర్నస్టులు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి మరో విషయం.

ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కందుకూరులో అశోక్, స్రవంతి దంపతులు వారి కుమారుడితో కలిసి జగన్‌ని కలిశారు. ఆ బాబుకి చిన్నప్పటి నుంచే వినికిడి లోపం ఉంది. మాటలు రాలేదు. ఆరేళ్ళ ఆ బాబును చాలా మంది వైద్యులకు చూపించారు. ఆపరేషన్‌కి దాదాపు 9లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించడానికి సాయపడతారేమోనని బాబుతో సహా టిడిపి నాయకులు చాలా మందితో వాళ్ళ సమస్య మొరపెట్టుకున్నారు. అయితే ఎవ్వరూ స్పందించలేదు. కానీ జగన్ మాత్రం వాళ్ళ సమస్య విన్న వెంటనే జగన్ చిన్నాన్న కొడుకు వైఎస్ కొండారెడ్డితో ఆ బాబుకు అపోలో హాస్పిటల్‌లో వైద్యం చేయించమని చెప్పాడు. అపోలోలో ఆ బాబుకు ఆపరేషన్ దిగ్విజయంగా జరిగింది. మాట్లాడడం కోసం ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు.

ఆ ఆనందాన్ని జగన్‌తో పంచుకోవడానికి ఈ రోజు కృష్ణా జిల్లాలో మరోసారి జగన్‌ని కలిశారు ఆ దంపతులు. జగన్‌ని కలిసి వెళ్తున్న ఆ దంపతులు ఎవరా అని మీడియా ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఆశ్ఛర్యపోవడం మీడియా జనాల వంతైంది. సాయం చేసే విషయంలో, మానవత్వం చూపే విషయంలో వైఎస్‌ల గొప్పదనాన్ని వేరే ఏ నాయకుడూ అందుకోలేరని మీడియా జనాలు మాట్లాడుకోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -