Friday, April 19, 2024
- Advertisement -

విహార యాత్రలకు వెళ్ళుతున్నారా? బి కేర్ ఫుల్

- Advertisement -

కాలేజీ విద్యార్ధులు విహార,విజ్ఞాన యాత్రలకు వెళ్ళటం మాములే. అయితే ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటిస్తే భద్రంగా ఉండొచ్చు.

* మీరు ఏ టూర్ కి వెళ్ళుతున్నారు. ఏ మార్గంలో వెళ్ళుతున్నారో వంటి విషయాలను కుటుంబ సభ్యులకు వివరంగా చెప్పాలి. మీతో పాటు వచ్చే స్నేహితుల పేర్లు,ఫోన్ నంబర్స్ ని మీ అమ్మ నాన్నలకు ఇవ్వాలి. మీ ఫోన్ కలవకపోయినా,ఏదైనా కారణంతో మీరు అందుబాటులోకి రాకపోయినా మీ వివరాలు

తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది.

* దూరం వెళ్ళుతున్నాం కదా అని మరీ ఎక్కువ సామాన్లు ప్యాక్ చేయకండి. ఎందుకంటే కొన్ని సార్లు ఆ బరువును మోయటం కష్టం కావచ్చు. విలువైన వస్తువులు తీసుకువెళ్ళకుండా ఉండటమే మంచిది.

* ఒంటరిగా బయటకు వెళ్ళటం,అపరిచితులతో తగవు పడటం వంటివి చేయకూడదు. అత్యవసరంగా బయటకు వెళ్ళవలసి వస్తే ఒకరిద్దరితో కలిసి వెళ్ళాలి. ఒకవేళ అలా కుదరకపోతే ఎవరికైనా చెప్పి వెళ్ళాలి. మీరు పిరికిగా కనపడకుండా దైర్యంగా ఉండాలి. పిరికిగా ఉంటే కొన్ని సార్లు లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -