- Advertisement -

జాన్వీ క‌పూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీల‌క వ్యాఖ్య‌లు !

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 236 కోట్ల భారీ వసూళ్లతో అల్-టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా చిత్రంలో ‘అప్పలసూరి’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) ఒక తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ ఇండస్ట్రీపై, తన క్యారెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 300 కోట్లు పెట్టి సినిమా తీసినప్పటికీ.. థియేటర్‌లో రూ. 300 పెట్టి టికెట్ కొని చూసే సామాన్య ప్రేక్షకుల చేతుల్లోనే ఇండస్ట్రీ తలరాత ఉంటుందని ఆయన నిరూపించారు.

ఈ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. తాజా ‘పెద్ది’ గ్లామర్ వివాదంపై హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కు పూర్తి మద్దతుగా నిలిచారు. “సినిమా విషయంలో నటీనటులను దయచేసి ట్రోల్ చేయకండి. పాపం ఆ అమ్మాయి (జాన్వీ) దర్శకుడు ఎలా చెప్తే అలా చేసింది. కొన్నిసార్లు కమర్షియల్ హంగుల వల్ల సీన్లు అలా మిస్‌ఫైర్ అవుతుంటాయి. ఈ విషయంలో నేను జాన్వీ కపూర్‌కు వంద శాతం సపోర్ట్ చేస్తాను. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ట్రోల్స్ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టకండి.” అంటూ హితవు పలికారు.

ఇక చిత్రంలో తన పాత్రకు జరుగుతున్న అన్యాయంపై జగపతి బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఒక స్టార్ డైరెక్టర్ ఫోన్ చేశారు. ‘పెద్ది లో మీరు అప్పలసూరిగా అంత గొప్ప పాత్ర చేసినా ఎవరూ ఎందుకు గుర్తించట్లేదు? అదే క్యారెక్టర్‌ను వేరే భాషకు చెందిన నటులు చేసి ఉంటే ఈపాటికి నెత్తిన పెట్టుకుని హైలైట్ చేసేవారు, మరో 20 సినిమాలు ఆఫర్ చేసేవారు.. మరి మిమ్మల్ని ఎందుకు ఎవరూ పట్టించుకోవట్లేదు?’ అని ప్రశ్నించారు. ఇది అక్షరాలా నిజం.. ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకే ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడ ఇండస్ట్రీకి వెళ్తే అక్కడ నన్ను విపరీతంగా గౌరవిస్తారు.” అని ఓపెన్ అయ్యారు.

షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు క్లాప్స్ కొట్టిన టీమ్.. ఇప్పుడు తనను ఎందుకు విస్మరిస్తోందని జగపతి బాబు ప్రశ్నించారు. “నేను కూడా సినిమా చూశాక బుచిబాబును ఒకటే ప్రశ్న అడిగాను.. షూటింగ్ అప్పుడు ప్రతి సీన్‌కు అంతగా అభినందించారు కదా, మరి ఇప్పుడెందుకు నా పాత్ర గురించి ఎవరూ మాట్లాడట్లేదు.. నన్ను మర్చిపోతున్నారా? అని అడిగాను. నేను మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా ‘పెద్ది’ విడుదల కోసమే ప్రాణం పెట్టి ఎదురుచూశాను. అందుకే నా గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాలకు నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. ‘పెద్ది’ ఇంకా ఎక్కువ ఆదరణ దక్కాల్సిన చిత్రం, ఖచ్చితంగా దక్కుతుంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ గర్వపడే రోజొస్తుంది” అని జగపతి బాబు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -