- Advertisement -

కర్ణాటక సీఎం పదవి వివాదంపై ఖర్గే

- Advertisement -

కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాల నేపథ్యంపై స్పందించారుకాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే . సిద్దరామయ్య–డీకే శివకుమార్ మధ్య ఉన్న అధికార పోరు విషయంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో తాను చర్చించి, అవసరమైన మధ్యవర్తిత్వాన్ని అందిస్తానని తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వ పనితీరును అంచనా వేయగల వారు అక్కడి ప్రజలేనని చెప్పారు. పార్టీ నాయకత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని, తాను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కలిసి ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తుది నిర్ణయం పార్టీ టాప్ లీడర్షిప్‌దేనని స్పష్టంగా చెప్పారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలంలో సగం దాటిన నేపథ్యంలో సీఎం మార్పు చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2023లో సిద్దరామయ్య–శివకుమార్ మధ్య సీఎం పదవి పంచుకునే ఒప్పందం జరిగిందన్న ప్రచారం మళ్లీ జోరందుకుంది. ఇటీవ‌ల సీఎం సిద్దరామయ్య, ఈ వివాదంపై ఉన్న “గందరగోళానికి” తెరదించాలని కేంద్ర నేతృత్వాన్ని కోరారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయం తనకూ, శివకుమార్‌కూ వర్తిస్తుందని అన్నారు.

మంగళవారం తన నియోజకవర్గం కనకపుర సందర్శనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐదుగురు–ఆరుగురు కాంగ్రెస్ నేతల మధ్య సీఎం పదవికి సంబంధించిన ఒక రహస్య ఒప్పందం జరిగిందని చెప్పారు.దీనిని బహిరంగంగా చర్చిస్తే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని, అందుకే మాట్లాడటం లేదని తెలిపారు.
సిద్దరామయ్య కేబినెట్ రీషఫిల్ అవకాశాన్ని ప్రస్తావించడం, తానే కొనసాగుతానని చెప్పడం, మరోవైపు శివకుమార్ అనుచరులు ఆయన సీఎం పదవిపై హక్కు ఉందని ప్రచారం చేయడం—వీటితో వివాదం మరింత రచ్చకెక్కింది.

బెంగళూరులో శివకుమార్ మాట్లాడుతూ.. సిద్దరామయ్యతో తనకు ఎలాంటి అధికార పోరు లేదని తెలిపారు. ఏ గ్రూపులు లేవు. ఒకే గ్రూప్ ఉంది — 140 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ గ్రూప్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -