Thursday, May 16, 2024
- Advertisement -

వాట్సాప్ సెక్యూరిటీకి అదిరిపోయే.. ఫీచ‌ర్‌ ఇదే!

- Advertisement -
whatsapp security super feature

ఫేస్ బుక్ తర్వాత స్థానం దక్కించుకుంది వాట్సాప్. ఇప్పుడు సోష‌ల్ మీడియా విభాగం అయిన వాట్సాప్ ఇంకో అడుగు ముందుకేసింది. వాట్సాప్ వాడే వారి భద్రత కోసం మరో కొత్త ఫీచర్‍ను ప్రవేశపెట్టింది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల అకౌంట్లను మరింత భద్రత కల్పించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ యూజర్లకి రెండంచెల వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. వాట్సాప్ వినియోగదారుల అక్కౌంట్ల‌ను ర‌క్షించేందుకు చాలా కాలం పాటు బీటా వెర్షన్‌లో పరీక్షించిన వాట్సాప్ ఇప్పుడు తాజాగా కొత్త ఆఫ్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఆఫ్షన్ ఉపయోగించాలంటే.. ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేసి అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. తర్వాత అందులో ‘టు-స్టెప్‌ వెరిఫికేషన్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో ఆరు అంకెల పాస్‌వర్డ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఈ-మెయిల్‌ ఐడీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పాస్‌వర్డ్ మర్చిపోతే ఈ ఈ-మెయిల్‌ సేఫ్‌గా ఉంటుంది. ఈ మెయిల్ ఐడీ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు వేరే మెయిల్ ఇస్తే ఆ లింక్ వేరే వాళ్లకు వెళ్లే ప్రమాదం ఉందని కంపెనీ తెలిపింది. కాగా, రీసెంట్ గా తెచ్చిన ఈ కొత్త ఆఫ్షన్‍తీ మీ అకౌంట్‌ వేరేవాళ్లు వెరిఫై చేసే వీలుండదు. ఒక వేళ కొత్తగా ఫోన్‌ మార్చాలనుకునేటప్పుడు ఈ ఆరంకెల పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.

{youtube}v=wMEPw3p-p9g{/youtube}

Related

  1. వాట్సాప్ లో సరికొత్త ఫీచ‌ర్‌!
  2. వాట్సాప్ లో రెండు సరికొత్త ఫీచ‌ర్లు
  3. వాట్స్ఆప్ లో డిలీట్ చేసిన మెసేజ్స్ కావలంటే ఇలా చేయండి!
  4. వామ్మో వాట్స్ యాప్ ని బ్యాన్ చేస్తారట !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -