Tuesday, May 7, 2024
- Advertisement -

వాట్సాప్ లో సరికొత్త ఫీచ‌ర్‌!

- Advertisement -
new features on whatsapp

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియా రంగంలో దూసుకుపోతోంది వాట్సాప్. స‌రికొత్త ఆప్ష‌న్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగ‌దారుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతోంది వాట్సాప్. ఈ నెపథ్యంలో వాట్సాప్ మరో సరికొత్త ఫీచ‌ర్‌తో రాబోతుంది. ఆ స‌రికొత్త ఫీచ‌ర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వాట్సాప్‌లో ఒక మెసేజి పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటు ఉంటే నాలుక్క‌ర‌చుకోవ‌డ‌మే త‌ప్ప ఏం చేయ‌లేం. అయితే ఇప్పుడు స‌రికొత్త ఆప్ష‌న్ ప్ర‌కారం ఒకసారి పంపిన మెసేజ్‌ను అన్ సెండ్ చేయ‌డం లేదా దానిని ఎడిట్ చేసే ఆప్ష‌న్ కూడా ఉంద‌ట‌.

మనం పొరపాటుగా ఓ మెసేజ్ ఒకరికి పంపితే వెంటనే దానిని డిలీట్ చేస్తాం.. కానీ అది మన ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతోంది. అవతలి ఫోన్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు వాట్సప్ కొత్త తీసుకరబోతున్న ఫీచర్ పుణ్యమాని అవతలి వాళ్ల ఫోన్లోంచి కూడా అది డిలీట్ అవుతోంది.

వాట్సప్ బీటా వెర్షన్‌లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుంది. ఈ కొత్త ఫీచ‌ర్‌తో ఒక్క మెసేజ్‌లే కాకుండా పొరపాటున పంపిన ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు.. ఇలా ఏవైనా కూడా అలాగే తీసేయొచ్చు. ఈ ఆప్ష‌న్ త్వ‌ర‌లోనే మ‌న‌కు అందుబాటులోకి రానుంది. గత సంవత్సరం నుంచి జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక రీసెంట్‌గా ఆండ్రాయిడ్ పాతవెర్షన్లు సహా ఐఫోన్ పాత వెర్షన్లలోను, కొన్ని విండోస్ ఫోన్లలోను వాట్సప్ పనిచేయదంటూ ఒక బాంబు కూడా పేల్చిన సంగతి తెలిసిందే.

Related

  1. వాట్సాప్ లో రెండు సరికొత్త ఫీచ‌ర్లు
  2. వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌!
  3. బ్రా ఫోటో ఫేస్ బుక్ లో పెట్టింది .. అప్పుడేమైంది ? 
  4. మీ మీద ఫేస్‌బుక్ కు ఆదాయం ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -