Tuesday, May 14, 2024
- Advertisement -

బాబు భజన అదిరింది ఆర్కే…… ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తావా?

- Advertisement -

అందరూ ఊహించినట్టుగానే….. షరామామూలుగానే చంద్రబాబు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో బ్రహ్మాండమైన భజన కథనంతో వీకెండ్ కామెంట్ అంటూ వచ్చేశాడు ఆర్కే. 2014 నుంచీ ఇప్పటి వరకూ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో నష్టపోవడానికి అధికారంలో ఉన్న చంద్రబాబు అస్సలు కారణం కాదని గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. పాపమంతా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌దే అని నమ్మించడానికి నానా తిప్పలూ పడ్డాడు. ప్రపంచంలోనే కాదు…. భారతదేశంలోనూ…. ఏ ఇతర రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగకపోవడానికి అధికారంలో ఉన్నవాళ్ళను కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళను విమర్శించడం అనేది ఇంకెక్కడా చూడలేం. ఆ వింత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతూ ఉంటుంది.

నరేంద్రమోడీకి ఓట్లేయమని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చెప్పింది ఎవరు? హోదాతో సహా అన్ని హామీలు నెరవేరాలంటే మోడీకి ఓటేయాల్సిందే అని ఊరూ వాడా ప్రచారం చేసింది ఎవరు? విభజన పాపంలో కాంగ్రెస్‌తో సమాన భాగం ఉన్నప్పటికీ ఆ విషయం సీమాంధ్ర ప్రజలకు తెలియకుండా మాయచేసింది ఎవరు? చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, బాబు భజన మీడియాలు కాదా? హోదా ఇవ్వము అని మోడీ ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఇదే రాధాకృష్ణ ఇదే వీకెండ్ కామెంట్‌లో మోడీ ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో సమర్థించాడో? ప్యాకేజ్‌కి ఒప్పుకుని చంద్రబాబు చాలా గొప్ప పని చేస్తున్నాడు, జగన్‌కే ఆ స్థాయి తెలివితేటలు లేకుండాపోయాయి అంటూ జగన్‌ని ఏ స్థాయిలో విమర్శించాడో మర్చిపోయాడా? హోదా కోసం పోరాటం చేస్తున్న సామాన్య ప్రజలను కూడా తెలివితక్కువ వాళ్ళన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు మర్చిపోయాడా? అవన్నీ మర్చిపోయినట్టుగా ఇప్పుడు రాధాకృష్ణ రాతలు ఉన్నాయి. పాప భారాన్ని మొత్తం వైఎస్ జగన్‌పై వేయాలన్న తాపత్రయం మాత్రం అడుగడుగునా కనిపించింది. చంద్రబాబు చేతకాని తనాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాజిటివ్‌గా చూపించి బాబుపై సానుభూతి వచ్చేలా చేయాలన్న ప్రయత్నం గట్టిగా చేశారు.

కాకపోతే ఇదే సందర్భంలో జగన్ అడిగిన ప్రశ్నలు మాత్రం పచ్చ బ్యాచ్‌కి ఘాటుగా తగుల్తున్నాయి. రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడే మోడీ ఏమీ ఇవ్వడని అర్థమైపోయింది. హోదా కేన్సిల్ అన్నప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమైపోయింది. మరి అప్పుడంతా ఎందుకు సమర్థించారు? బడ్జెట్‌లో ఎపికి అన్యాయం జరుగుతుందని చంద్రబాబుకు ముందు తెలియదా? మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు పార్టీ కూడా భాగస్వామి. ఇద్దరు కేబినెట్ మంత్రులు ఉన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై కేబినెట్‌లో ముందుగానే చర్చిస్తారు. కేబినెట్ మంత్రులకు విషయాలన్నీ ముందే తెలిసిపోతాయి. మరి ఎపికి ఏమీ కేటాయించడం లేదు అని ముందుగానే తెలుసుకున్న టిడిపి కేంద్ర కేబినెట్ మంత్రులు బాబుకు ఏమీ చెప్పలేదు అంటే నమ్మాలా? అయినా నరేంద్రమోడీ రాష్ట్రానికి ఏమీ చేయడు అన్న విషయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ ఎప్పుడో తెలుసు. ఆ విషయం బాబుకు ఇప్పటి వరకూ ఎందుకు అర్థం కాలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం చివరి వరకూ మోడీతో కొనసాగి చివరి నిమిషంలో మోడీ అన్యాయం చేశాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును నమ్మాలా? వైఎస్సార్ చనిపోయిన తర్వాత నుంచీ కాంగ్రెస్‌తో కుమ్మక్కవ్వడం, జగన్‌ని జైలుకు పంపించడం, రాష్ట్ర విభజననాడు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం చేయడం, ఆ తర్వాత నరేంద్రమోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన రుద్దడం, ఇప్పుడిక 2019లో మరో డ్రామా…….ఈ డ్రామాలే కదా స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో తీరని ఆవేదన ఎప్పటికీ ఉండేలా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌనంగా రోదిస్తున్న పరిస్థితి కనపడడం లేదా? మరోసారి కూడా ఇలాంటి డ్రామాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -