Tuesday, April 23, 2024
- Advertisement -

ఎల్లో మీడియా vs బ్లూ మీడియా.. ఏది జర్నలిజం !

- Advertisement -

ఒకప్పుడు మీడియా అంటే ఒక భరోసా గా భావించేవారు ప్రజలు. ప్రజా వాక్కును ప్రపంచానికి వినిపిస్తూ.. ప్రభుత్వాలు చేసే తప్పులను నిర్భయంగా నిలదీస్తూ, అవినీతి పరులకు కొరకరాని కొయ్యగా ఉంటూ.. నిజాలను నిర్భయంగా ప్రజా కోర్టులో ఉంచుతూ.. ప్రజల పక్షానా.. ప్రజా ఆయుధంగా మీడియా ఉండేది. అందువల్ల ఇప్పటికీ కూడా ప్రజలు ప్రభుత్వాల కన్నా మీడియానే ఎక్కువ నమ్ముతారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి మీడియా నేటిరోజుల్లో విశ్వసనీయత కోల్పోతుందా అంటే అవునని చెప్పక తప్పదు. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలకు కొమ్ము కాస్తూ విలువలను కుని చేస్తోంది నేటి మీడియా రంగం. ముఖ్యంగా ఏపీలో ఎల్లో మీడియా వర్సస్ బ్లూ మీడియా వ్యవహారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ పాలన విధానంలోని లోటుపాట్లను పక్కన పెట్టి.. కేవలం ప్రభుత్వానికి భజన చేయడమే ప్రధాన ఎజెండా వ్యవహరిస్తూ ఉంటాయి. అలాంటి మీడియా సంస్థలను బ్లూ మీడియా అంటూ ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు పిలుస్తుంటారు.

ఇక ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా విషయానికొస్తే.. ప్రభుత్వ పాలనలోని తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా కేవలం తప్పులను మాత్రమే ప్రజలకు చూపిస్తూ.. ప్రతిపక్ష పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో మాత్రమే ఉంటాయి. మరి ఇలాంటి మీడియా సంస్థలను ఎల్లో మీడియా గా పిలుస్తుంటారు ప్రభుత్వ పార్టీ నేతలు.

మరి ప్రజలా పక్షాన నిలిచే మీడియా ఏది అంటే సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది. ఇలా రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రజా విలువలను గాలికి వదిలేస్తున్నాయి నేటి మీడియా సంస్థలు.. ఇదేనా అసలైన జర్నలిజం ? ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే నేటి మీడియా రంగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : ఎన్టీఆర్ vs కే‌సి‌ఆర్.. అసలేంది ఈ రచ్చ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -