Sunday, May 5, 2024
- Advertisement -

టీ 20 ర్యాంకిగ్స‌లో రెండ‌వ స్థానాన్ని పొంద‌డానికి భార‌త్‌కు ల‌క్కీ ఛాన్స్‌..?

- Advertisement -

ముక్కోణపు ట్వంటీ 20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పరాజయం పాలైనప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ కారణంగా తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ పోరులో ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఆ జట్టు 9 పరుగులే చేసింది. ఈ గెలుపు ఇంగ్లాండ్‌కు ఉపయోగపడలేదు. కానీ భారత్‌కు మాత్రం వరంగా మారనుంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా టీ20ల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది.

టీ20ల్లో 126 పాయింట్లతో పాకిస్థాన్ మొద‌టిస్థానంలో ఉండగా.. 123 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. టీమిండియా (121 పాయింట్లు), న్యూజిలాండ్ (120) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో 3-0 తేడాతో నెగ్గితే.. కోహ్లి సేన రెండో స్థానానికి చేరుకోనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ తన ర్యాంకును మెరుగు పర్చుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -